PRC: జీతాలపై జగన్ సర్కారు కీలక ఆదేశాలు.. ఆగని ఉద్యోగుల ఆందోళనలు..

PRC: జీతాలపై జగన్ సర్కారు కీలక ఆదేశాలు.. ఆగని ఉద్యోగుల ఆందోళనలు..
Prc

కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు చేసేందుకు రెడీ అవుతోంది ఏపీ రాష్ట్ర సర్కార్. కొత్త పీఆర్సీ లిస్టును ట్రెజరీ కార్యాలయాలకు పంపించింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేయాలని ఆదేశించింది..

Sanjay Kasula

|

Jan 20, 2022 | 12:37 PM

AP PRC: కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు చేసేందుకు రెడీ అవుతోంది ఏపీ రాష్ట్ర సర్కార్. కొత్త పీఆర్సీ లిస్టును ట్రెజరీ కార్యాలయాలకు పంపించింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేయాలని ఆదేశించింది. ఇదిలావుంటే.. ఏపీలో ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై ఓ వైపు ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపునకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ట్రేజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా జీతాల్లో మార్పులు చేయాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు జీతాల చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను సీఎఫ్ఎంఎస్ సిద్ధం చేస్తింది.

పీర్సీ ఉత్తర్వులను వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నాయి. వీటిని మరింత పెంచుతామని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో డ్యూటీలకు హాజరవుతున్నారు. చివరి అస్త్రంగా సమ్మెకు దిగాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందు ఇవ్వాల్సిన సమ్మె నోటీసును శుక్రవారం రోజు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సమీర్ శర్మకు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇవాళ అమరావతిలో నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యచరణను ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి: Budget 2022: సామాన్యుల జీవన చక్రం.. పరుగుల బండిపై నిర్మలమ్మ నజర్.. రైల్వేపై ఎలా..

Black Diamond: దుబాయ్‌లో అతి పెద్ద నల్ల వజ్రం ఆవిష్కారం.. ఈ బ్లాక్ డైమండ్‌ చాలా స్పెషాల్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu