అమరావతిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీ.. ఆరు వారాలే గడువు

రాజధాని అమరావతి సహా పట్టణాభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జీఎస్ రావు కన్వీనర్‌గా ఉండబోతున్న ఈ కమిటీలో ప్రొ. మహవీర్, డా. అంజలీ మోమన్, ప్రొ. శివానందస్వామి, ప్రొ.కె.టి. రవీంద్రన్, డా.కె.వి. అరుణాచలం సభ్యులుగా ఉన్నారు. వీరంతా అమరావతి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై విశ్లేషణ చేయనున్నారు. ఈ సభ్యులంతా పట్టణాభివృద్ధి రంగంలో నిపుణులు కావడం విశేషం. కాగా ఆరు వారాల్లోగా వీరు ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు పర్యావరణం, వరదల […]

అమరావతిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీ.. ఆరు వారాలే గడువు
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 9:27 PM

రాజధాని అమరావతి సహా పట్టణాభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జీఎస్ రావు కన్వీనర్‌గా ఉండబోతున్న ఈ కమిటీలో ప్రొ. మహవీర్, డా. అంజలీ మోమన్, ప్రొ. శివానందస్వామి, ప్రొ.కె.టి. రవీంద్రన్, డా.కె.వి. అరుణాచలం సభ్యులుగా ఉన్నారు. వీరంతా అమరావతి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై విశ్లేషణ చేయనున్నారు. ఈ సభ్యులంతా పట్టణాభివృద్ధి రంగంలో నిపుణులు కావడం విశేషం. కాగా ఆరు వారాల్లోగా వీరు ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు పర్యావరణం, వరదల నియంత్రణలో నిపుణులైన వారిని కమిటీలో కో ఆప్షన్ సభ్యుడిగా నియమించుకోవచ్చని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే గత కొన్ని రోజులుగా అమరావతి విషయం రాష్ట్రంలోని రాజకీయ పార్టీల మధ్య పెను దుమారాన్నే సృష్టిస్తోంది. అమరావతిలో వరదలు వచ్చిన సమయంలో రాజధానిపై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి ఖర్చు ఎక్కువ అవుతుందని, వరదలు వస్తే మునిగిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలతో అమరావతి వివాదం మొదలైంది. వైసీపీ ప్రభుత్వం రాజధానిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వచ్చాయి. అమరావతి నుంచి దొనకొండకు రాజధానిని మార్చే అవకాశాలు ఉన్నాయని పుకార్లు గుప్పుమన్నాయి. దీంతో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయి, రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. రాజధాని రైతులు కూడా ఈ వివాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడినప్పటికీ.. అమరావతి నిర్మాణంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇక ఇంత జరుగుతున్నా.. సీఎం వైఎస్ జగన్ అమరావతి వివాదంపై స్పందించకపోవడంపై ప్రజల్లోనూ అనుమానాలు రోజురోజుకు పెరిగాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి.. ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీ తన నివేదికలో ఏం చెప్తుందో చూడాలి.