ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం అత్యంత పటిష్టంగా అమలుకావాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ లోని హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ పథకం అత్యంత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారుల్నిఆదేశించారు.

ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం అత్యంత పటిష్టంగా అమలుకావాల్సిందే..
Follow us

|

Updated on: Sep 04, 2020 | 4:17 PM

ఆంధ్రప్రదేశ్ లోని హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ పథకం అత్యంత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారుల్నిఆదేశించారు. ఆ పథకాన్ని నీరుగార్చేలా ఒక వేళ ఆస్పత్రులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌లను ఉండాలన్నారు. ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నప్రతి ఆస్పత్రిలోనూ రిఫరల్‌ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. కరోనా కట్టడిపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రోగులకు వైద్యం సరిగ్గా అందలేదంటే వారిని సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రలదేనని సీఎం తేల్చిచెప్పారు. పతిరోజూ అధికారులు కాల్‌ సెంటర్లకు మాక్‌ కాల్‌ చేసి పనితీరును పరిశీలించాలని చెప్పారు. ప్రతి మాక్‌ కాల్‌పై వస్తున్న రెస్పాన్స్‌ను కూడా రికార్డు చేయాలన్నారు. ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలిక సదుపాయాలు అనే ఈ నాలుగు పారామీటర్స్‌ మీద ప్రశ్నలు వేసి రోగులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని.. వీటిద్వారా ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను కోరారు.