Kannababu : రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకున్న బాబుకి 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు : కన్నబాబు

Kurasala Kannababu : అన్నదాతల్ని మోసం చేసినందుకే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును, తెలుగు దేశం పార్టీని 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించారని..

Kannababu : రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకున్న బాబుకి 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు : కన్నబాబు
kurasala kannababu
Follow us

|

Updated on: May 27, 2021 | 12:43 AM

Kurasala Kannababu : అన్నదాతల్ని మోసం చేసినందుకే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును, తెలుగు దేశం పార్టీని 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. 2014 ఎన్నికల సమయంలో రైతులకు పంట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకొని మోసం చేసిన చంద్రబాబుకు ఏపీ ప్రజలంతా కలిసి తగిన శాస్తి చేశారని ఆయన విమర్శించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకొని చంద్రబాబు ..రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచిందని, ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా నిలిచిందని కన్నబాబు చెప్పారు. వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకంపై టీడీపీ నేతల ఆరోపణలను మంత్రి ఖండించారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అయితే, ఐదేళ్లలో రుణాలు మాఫీ చేయకుండా మోసం చేయడంతో 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతులు నష్టపోకూడదని ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలిచారు. గత 23 నెలల్లోనే రైతులకు ఏకంగా రూ.83 వేల కోట్లు ఖర్చు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు.

Read also : KGH Hospital : కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్ పై దాడి చేసిన వాళ్లని అరెస్ట్ చేయాలంటూ విధులు బహిష్కరించిన జుడాలు