టీటీడీ ఛైర్మన్‌ ఇంటికి అఘోరాలు.. ఎందుకొచ్చారంటే..!

టీటీడీ ఛైర్మన్‌ ఇంటికి అఘోరాలు.. ఎందుకొచ్చారంటే..!

టీటీడీ ఛైర్మన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు విచ్చేశారు. హిమాలయాల నుంచి వచ్చిన ఈ అఘోరాలు విజయవాడలోని వైవీ ఇంటికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానం మేరకే వారు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. పూజల తరువాత అఘోరాలు వైవీ కుటుంబానికి ఆశ్వీరచనం ఇవ్వగా.. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే అఘోరాలు బీజేపీ సీనియర్ నేత, నరసాపురం మాజీ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 14, 2019 | 9:21 PM

టీటీడీ ఛైర్మన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు విచ్చేశారు. హిమాలయాల నుంచి వచ్చిన ఈ అఘోరాలు విజయవాడలోని వైవీ ఇంటికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానం మేరకే వారు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. పూజల తరువాత అఘోరాలు వైవీ కుటుంబానికి ఆశ్వీరచనం ఇవ్వగా.. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Aghoras visit TTD Chairman YV Subba Reddy house in Vijayawada

అలాగే అఘోరాలు బీజేపీ సీనియర్ నేత, నరసాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు ఇంటికి కూడా వెళ్లారు. గంగరాజు కుటుంబ సభ్యులను అఘోరాలు ఆశీర్వదిస్తున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే హిమాలయాల్లో ఘోర తపస్సు చేసుకునే అఘోరాలు ఇప్పుడు వైవీ, గోకరాజు ఇంటికి వెళ్లి పూజలు చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu