‘ప్రత్యేక హోదా’ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత!

'ప్రత్యేక హోదా' ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ గత ఐదేళ్ళలో ఎందరో యువతీ, యువకులు ఉద్యమాలు చేసి.. పోలీసులు కేసులు ఎదుర్కుంటున్నారు. వారందరికీ జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులను ఎత్తివేయాలంటూ హోంశాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కేసుల విత్ డ్రా పిటిషన్లు ఫైల్ చేయాల్సిందిగా సూచించింది. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా […]

Ravi Kiran

|

Sep 14, 2019 | 6:40 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ గత ఐదేళ్ళలో ఎందరో యువతీ, యువకులు ఉద్యమాలు చేసి.. పోలీసులు కేసులు ఎదుర్కుంటున్నారు. వారందరికీ జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులను ఎత్తివేయాలంటూ హోంశాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కేసుల విత్ డ్రా పిటిషన్లు ఫైల్ చేయాల్సిందిగా సూచించింది.

అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలిపిన యువకులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులన్నీ ఉపసంహరించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా 13 జిల్లాల నవ్యాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. కానీ ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని మోదీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఏపీలో నిరసనలు వెల్లువెత్తాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu