బీ ఫారాలు అందక అభ్యర్థుల్లో ఆందోళన

సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల గడుపు సోమవారం (మార్చి 25)తో ముగియనుంది. శని, ఆదివారాలు సెలవు కావడంతో బీ ఫారాలు అందని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకుంది. నామినేషన్ పత్రాల్లో అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, కుటుంబ వివరాలు, కేసుల తదితర సమాచారం సవివరంగా పొందుపర్చాలి. మంచి ముహూర్తం కావడంతో శుక్రవారం పెద్ద ఎత్తున అన్ని పార్టీల అభ్యర్థులూ నామినేషన్లు వేశారు. అయితే, ఇంకా జనసేన, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడానికి కారణం బీఫారాలు అందకపోవడమేనని […]

బీ ఫారాలు అందక అభ్యర్థుల్లో ఆందోళన
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 1:59 PM

సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల గడుపు సోమవారం (మార్చి 25)తో ముగియనుంది. శని, ఆదివారాలు సెలవు కావడంతో బీ ఫారాలు అందని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకుంది. నామినేషన్ పత్రాల్లో అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, కుటుంబ వివరాలు, కేసుల తదితర సమాచారం సవివరంగా పొందుపర్చాలి. మంచి ముహూర్తం కావడంతో శుక్రవారం పెద్ద ఎత్తున అన్ని పార్టీల అభ్యర్థులూ నామినేషన్లు వేశారు.

అయితే, ఇంకా జనసేన, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడానికి కారణం బీఫారాలు అందకపోవడమేనని సమాచారం. ప్రధాన పార్టీల్లో టిక్కెట్ దక్కని ఆశావాహులు చివరి నిమిషంలో పార్టీలు మారుతారని, వీరిలో గుర్తింపు ఉన్న నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించాలనే ఆలోచనతో కొందరికి బీఫారాలు ఇవ్వడంలేదనే వాదన వినిపిస్తోంది. ఇక, ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించి, బీఫారాలను అందజేశాయి. బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ఖరారుచేసి, ఈ మేరకు నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించాయి. కానీ, బీ ఫారాలు మాత్రం ఇప్పటి వరకూ ఇవ్వలేదని టిక్కెట్టు దక్కిన నేతలు వాపోయారు.