చాలామంది తక్కువ అంచనా వేసే ఈ పండు.. పోషకాల ఖజానా

17 June 2026

TV9 Telugu

TV9 Telugu

పేదింటి ఫలరాజుగా భావించే జామపండును రోజూ తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందంటారు వైద్యులు

TV9 Telugu

కాల్షియం, ఐరన్‌ కలగలసి ఉండి ఏడాదంతా లభ్యమయ్యే పండు జామ. ఐదు యాపిల్‌ కాయలు తింటే ఎన్ని పోషకాలు అందుతాయో ఒక జామపండు తింటే అన్ని పోషకాలుంటాయట

TV9 Telugu

నారింజతో పోల్చితే జామపండులో విటమిన్‌ ‘సి’ సుమారు 5 రెట్లు ఎక్కువ లభిస్తుంది. పొటాషియం కోసం ఎక్కువ మంది అరటి పండును ఎంచుకుంటారు

TV9 Telugu

కానీ జామలో తక్కువ తీపి పదార్థంతో ఎక్కువ పొటాషియం ఉంటుంది. అలాగే విటమిన్‌ ఎ, ఫోలేట్, పీచు, కొద్దిమొత్తంలో ఇనుము కూడా ఉంటుంది

TV9 Telugu

అరటి, ఆపిల్, నారింజ పండ్లలో 2.5 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ పీచు పదార్థం ఉంటే జామలో ఏకంగా 6 మిల్లీగ్రాములు లభిస్తుంది

TV9 Telugu

జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే జామకాయలే కాదు.. జామాకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి

TV9 Telugu

వీటితో మొటిమలు, బ్లాక్‌హెడ్స్ సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు. జామాకులో యాంటీసెప్టిక్‌ గుణాలు అధికంగా ఉంటాయి

TV9 Telugu

అవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాని నశింపజేస్తాయట. దీనికోసం జామాకులతో చేసిన పేస్ట్‌ని మొటిమల దగ్గర అప్లై చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ఫలితం ఉంటుంది