AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వాహనదారులకు బిగ్ అలర్ట్.. 30 రోజులే డెడ్ లైన్.. ఈ పని చేయకపోతే సమస్యలే..

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. వాహన్ వెబ్ సైట్లోకి వెళ్లి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. దీని వల్ల మీకు రవాణశాఖకు సంబంధించిన సమాచారం మొత్తం నిమిషాల్లోనే అందుతుంది. నిమిషాల్లోనే నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.

Telangana: వాహనదారులకు బిగ్ అలర్ట్.. 30 రోజులే డెడ్ లైన్.. ఈ పని చేయకపోతే సమస్యలే..
Traffice Rules
Venkatrao Lella
|

Updated on: Jun 17, 2026 | 1:51 PM

Share

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. 30 రోజుల్లోగా పరివాహన పోర్టల్‌లో తప్పనిసరిగా మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు జూన్ 1న నోటిఫికేషన్ జారీ చేసింది. పరివాహన్ వెబ్ సైట్లో మొబైల్, ఈమెయిల్ వివరాలు అప్డేట్ చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మీ వాహనంపై ఏదైనా ట్రాఫిక్ చలానా పడినప్పుటు వాట్సప్,ఈ-మెయిల్, మొబైల్ నెంబర్‌కు సమాచారం అందిస్తారు. దీని వల్ల మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడినట్లు మీకు తెలుస్తుంది. చాలామందికి తమ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందనే విషయం కూడా తెలియడం లేదు. దీంతో అప్‌డేట్ చేసుకోేవాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని చెబుతున్నారు.

నిమిషాల్లోనే సమాచారం

ట్రాఫిక్ చలాన్ల గురించి సమాచారం తెలియపోవడం వల్ల పెండింగ్ జరిమానాలు చెల్లించలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడినప్పుడు వాహనదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. తెలంగాణలో దాదాపు రూ.1930 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వాహనదారులు తమ మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయకపోవడం వల్ల చలాన్ల వివరాలు తెలియడం లేదు. మొబైల్ నెంబర్ మార్చినప్పుడు పరివాహన్ వెబ్ సైట్లోకి వెళ్లి కొత్త నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. దీని వల్ల ఏమైనా చలాన్లు పడితే వెంటనే మీకు తెలుస్తుంది. అంతేకాకుండా చలాన్లు వాహన యాజమానికి పంపించినట్లు రవాణశాఖ పరిగణిస్తుంది. ఇక ట్రాఫిక్ చలాన్లు మాత్రమే కాకుండా ఫిట్ నెట్, ట్యాక్స్, పర్మిట్ వంటి సమాచారాన్ని వేగంగా తెలుసుకోగలరు.

అప్డేట్ చేసుకోండి

ట్రాఫిక్ చలాన్లు పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉండటం, వాహనదారుల పాత మొబైల్ నెంబర్లు డేటా బేస్‌లో రికార్డు అయి ఉండటం వల్ల రవాణాశాఖకు పెద్ద సవాల్‌గా మారింది. ట్రాఫిక్ చలాన్ల గురించి నోటిఫికేషన్ అందకపోయినా చెల్లింపు బాధ్యత వాహన యాజమానిపై ఉంటుంది. ఈ మేరకు కొత్త నిబంధనలను రవాణశాఖ అమల్లోకి తెచ్చింది. అదే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో కోర్టు నోటీసులు,అదనపు జరిమానాలు వంటి సమస్య ఉండదు.

నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి..?

http://vahan.parivahan.gov.in పోర్టల్‌లోకి వెళ్లాలి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి వాహన రిజిస్ట్రేషన్, చాసిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ వివరాలు ఎంటర్ చేయాలి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి

Follow Us