AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Insurance: జ్వరం, జలుబు లాంటి వ్యాధులకు హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..? కవరేజీ రావాలంటే ఏం చేయాలి..?

జ్వరం, జలుబు లాంటివి వస్తే హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. అయితే ప్రాధమిక బీమాలో ఇది కవర్ అవ్వదు. ఇందుకోసం మీరు యాడ్ ఆన్ ఎంచుకోవాలి. యాడ్ ఆన్ ఆప్షన్ ఎలా ఎంచుకోవాలి... ఎలాంటి ఖర్చులకు వర్తిస్తుంది..?

Health Insurance: జ్వరం, జలుబు లాంటి వ్యాధులకు హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..? కవరేజీ రావాలంటే ఏం చేయాలి..?
Health Insurance
Venkatrao Lella
|

Updated on: Jun 17, 2026 | 1:28 PM

Share

హెల్త్ ఇన్యూరెన్స్. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీఒక్కరికి తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే వైద్య ఖర్చులు నానాటికి పెరిగిపోతున్నాయి. హాస్పిటల్‌లో కాలు అడుగుపెడితే రూ.వేలు, రూ.లక్షల్లో ఖర్చవుతుంది. దీంతో హాస్పిటల్‌ వైపు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి గురై సర్జరీలు చేయించుకోవాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇలాంటి సమయంలో అప్పులు తెచ్చి మరి హాస్పిటల్ బిల్లులు కడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు ఆర్ధికంగా నష్టపోకుండా హెల్త్ ఇన్యూరెన్స్ అనేది కాపాడుతుంది. అయితే చిన్న చిన్న వ్యాధులకు కూడా హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..? లేదా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

జ్వరం, జలుబుకు కూడా వర్తిస్తుందా..?

జ్వరం, జలుబు లాంటి చిన్న వ్యాధుల బారిన పడినప్పుడు హాస్పిటల్‌లో చేరే అవకాశం ఉండదు. కేవలం డాక్టర్‌ను కలిసి మందులు తీసుకుని వెళుతుంటాం. ఇలాంటి వాటికి హెల్త్ ఇన్యూరెన్స్ వరిస్తుందా అంటే.. ఖచ్చితంగా వరిస్తుంది. కానీ మీరు అదనంగా ఓపీడీ ఆప్షన్ యాడ్ ఆన్‌లో ఎంచుకోవాలి. ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ అని అర్థం. జస్ట్ డాక్టర్‌ను కలిసి మెడిసిన్స్ తీసుకెళ్లడం, ప్రిస్క్రిప్షన్ మార్చుకోవడం లాంటివి ఈ విభాగం కిందకు వస్తాయి. ఇందుకు డాక్టర్‌కు ఫీజు రూపంలో కొంతమేర చెల్లించాల్సి ఉంటుంది. వీటికి కూడా హెల్త్ ఇన్యూరెన్స్ వర్తించాలంటే.. మీరు యాడ్ ఆన్‌లో ఓపీడీ కవరేజీ తీసుకోవాల్సింది. ఇందుకు కొంత ప్రీమియం పెరుగుతుంది. ఈ ఓపీడీ కవర్ మీరు తీసుకుంటే జ్వరం, జలుబు లాంటి చిన్న వ్యాధులు కూడా కవర్ అవుతాయి.

ఓపీడీ కవరేజీ ఎందుకు తీసుకోవాలి..?

కొంతమంది షుగర్, బీపీ లాంటి దీర్థకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో తరచూ డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుది. ఇలాంటివారికి ఓపీడీ కవర్ వల్ల లాభం జరుగుతుంది. డాక్టర్ల ఫీజులు ఆదా అవుతాయి. కొన్ని రకాల డెంటల్ ట్రీట్‌మెంట్, ఫిజియోథెరపీ లాంటి చికిత్సలకు కూడా ఓపీడీ వర్తిస్తుంది. కానీ అప్పుడప్పుడు జ్వరం, జలుబు లాంటి చిన్న వ్యాధులతో హాస్పిటల్‌కు వెళ్లేవారికి ఓపీడీ కవరేజీ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఓపీడీ కవరేజీకి అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఓపీడీ కవర్ తీసుకునే సమయంలో పాలసీ డాక్యుమెంట్‌లో నిబంధనల గురించి తెలుసుకోండి. ఓపీడీ కవర్ రూ.10 వేలు ఉన్నా.. డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఒక్కసారికి రూ.500 అనే నిబంధన పెడతారు. ఇక ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వంటి ఆయుష్ చికిత్సలకు కూడా హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుంది.

Follow Us
జ్వరం, జలుబు వస్తే హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..?
జ్వరం, జలుబు వస్తే హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..?
రెడ్‌మీ నుంచి అదిరిపోయే లుక్‌తో కాంప్యాక్ట్‌ ఫోన్‌..
రెడ్‌మీ నుంచి అదిరిపోయే లుక్‌తో కాంప్యాక్ట్‌ ఫోన్‌..
మీ సక్సెస్‌కు అడ్డుగా నిలిచే అతిపెద్ద శత్రువు ఇదే..
మీ సక్సెస్‌కు అడ్డుగా నిలిచే అతిపెద్ద శత్రువు ఇదే..
భర్త ఇంటి నుంచి బయలుదేరగానే భార్యలు చేయకూడని 7 పనులు.. లేదంటే..
భర్త ఇంటి నుంచి బయలుదేరగానే భార్యలు చేయకూడని 7 పనులు.. లేదంటే..
శివసేనలో మరో చీలిక?.. థాకరే క్యాంప్‌లో కలకలం!
శివసేనలో మరో చీలిక?.. థాకరే క్యాంప్‌లో కలకలం!
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్
సీబీఎస్సీ 10వ తరగతి సెకండ్‌ బోర్డు ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
సీబీఎస్సీ 10వ తరగతి సెకండ్‌ బోర్డు ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
పీఎఫ్ వడ్డీ అకౌంట్లలోకి ఎప్పుడంటే..? కేంద్రం క్లారిటీ
పీఎఫ్ వడ్డీ అకౌంట్లలోకి ఎప్పుడంటే..? కేంద్రం క్లారిటీ
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆదర్శం: సీఎం రేవంత్
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆదర్శం: సీఎం రేవంత్
జగన్నాథుడి విగ్రహాలు ఎందుకు అసంపూర్ణంగా కనిపిస్తాయి? ఆశ్చర్యపరిచే
జగన్నాథుడి విగ్రహాలు ఎందుకు అసంపూర్ణంగా కనిపిస్తాయి? ఆశ్చర్యపరిచే