Amanchi Krishna Mohan: ఆమంచికి గ్రాండ్ వెల్ కమ్.. వందలాది కార్లు, బైక్ లతో ర్యాలీలతో హోరెత్తిన పర్చూరు..

పర్చూరులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ఆమంచి కృష్ణమోహన్. ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఆమంచికి భారీ ఎత్తున స్వాగతం పలికాయి వైసీపీ శ్రేణులు. నియోజకవర్గ వైసీపీ నూతన సమన్వయ కర్త హోదాలో ఫస్ట్...

Amanchi Krishna Mohan: ఆమంచికి గ్రాండ్ వెల్ కమ్.. వందలాది కార్లు, బైక్ లతో ర్యాలీలతో హోరెత్తిన పర్చూరు..
Amanchi Krishna Mohan
Follow us

|

Updated on: Jan 14, 2023 | 6:53 AM

పర్చూరులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ఆమంచి కృష్ణమోహన్. ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఆమంచికి భారీ ఎత్తున స్వాగతం పలికాయి వైసీపీ శ్రేణులు. నియోజకవర్గ వైసీపీ నూతన సమన్వయ కర్త హోదాలో ఫస్ట్ టైం వచ్చిన ఆమంచికి గ్రాండ్ వెల్ కమ్ పలికాయి నియోజకవర్గ పార్టీ శ్రేణులు. వందలాది కార్లు, బైక్‌లతో భారీ ర్యాలీ చేశారు. కార్యకర్తల నినాదాలతో పర్చూరును హోరెత్తించారు. భారీ గజమాలతో అభిమానులు స్వాగతం పలికారు. ప్లెక్సీలు, వైసీసీ జెండాలతో పర్చూరును కప్పేశారు. ఆమంచి కృష్ణమోహన్ రాకతో పర్చూరు వైసీపీ రంగు మయమైంది. నూతన రథసారథి రాకతో వైసీపీ కేడర్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇసుకేస్తే రాలనంతగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు. భారీగా తరలిచ్చిన వైసీపీ శ్రేణులతో బొమ్మల సెంటర్ కిక్కిరిసిపోయింది.

బొమ్మల సెంటర్లోని వైఎస్ఆర్, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఆమంచి. తర్వాత పర్చూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సి పోతుల సునీతలకు పలువురు నాయకులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ఆమంచిని భారీ మెజార్టీతో గెలిపించి.. వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలో తీసుకురావాలని క్యాడర్‌కి పిలుపునిచ్చారు వైసీపీ నేతలు.

ఆమంచి కృష్ణమోహన్ చీరాల ఎమ్మెల్యేగా 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో ఆయన సొంతంగా నవోదయం పార్టీని పెట్టుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ లో చేరిన ఆమంచి కృష్ణమోహన్ ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..