Amanchi Krishna Mohan: ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమంచి కృష్ణమోహన్..

Amanchi Krishna Mohan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సంచలన..

Amanchi Krishna Mohan: ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమంచి కృష్ణమోహన్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 10, 2021 | 3:29 PM

Amanchi Krishna Mohan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్ సీట్లో టీడీపీ కార్యకర్త కూర్చుంటే ఏ విధంగా ఆలోచిస్తారో.. నిమ్మగడ్డ రమేష్ కూడా ఆ విధంగా చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న తరుణంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం అనైతికమన్నారు. ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా గ్రామాల్లో ఆధిపత్యం కోసం గ్రూపులుగా విడిపోయిన వారిని ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన రాజకీయ పార్టీకి లబ్ధి చేయడం కోసమే నిమ్మగడ్డ రమేష్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ఆమంచి కృష్ణమోహన్ నిప్పులు చెరిగారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించామని, కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆమంచి కృష్ణమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also read:

హర్యానాలో అన్నదాతలపై పోలీసుల లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగం, సీఎం ఖట్టర్ రాకను అడ్డునేందుకు రైతుల యత్నం

World Wide Corona Update: ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం… తాజాగా 9 కోట్లు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య