Andhra Pradesh: ఆ ఊర్లో సంక్రాంతి పండక్కి కనపడని సందడి.. నిర్మానుష్యంగా ఇళ్లు! కారణం తెలిస్తే గుండె బరువెక్కుద్ది

సంక్రాంతి పండగ ప్రతి తెలుగోడికి ఎంతో ప్రత్యేకం. బతుకు తెరువు కోసం పట్నం బాటపట్టిన వారంతా రెక్కలు కట్టుకుని మరీ సొంతూర్లో వాలిపోతుంటారు. ఉన్నంతలో బంధుజనాలతో సందడిగా పండగ మూడు రోజులు జరుపుకుంటారు. అయితే ఓ గ్రామం మాత్రం ప్రతీయేట సంక్రాంతి పండక్కి పల్లెను వదిలి పట్నానికి వలప పోతుంది. దీని వెనుక గుండె బరువెక్కే గాథ ఉంది. అదేంటంటే..

Andhra Pradesh: ఆ ఊర్లో సంక్రాంతి పండక్కి కనపడని సందడి.. నిర్మానుష్యంగా ఇళ్లు! కారణం తెలిస్తే గుండె బరువెక్కుద్ది
Obulapuram Village In Sankranti Season
Follow us
Fairoz Baig

| Edited By: Srilakshmi C

Updated on: Jan 14, 2025 | 6:46 PM

ప్రకాశంజిల్లా కొమరోలు మండలం ఓబులాపురం గ్రామంలో ప్రతి సంక్రాంతికి విచిత్ర పరిస్థితిలు కనిపిస్తాయి. గ్రామం మొత్తం నిర్మానుష ప్రదేశంగా మారిపోతుంది. ఏ ఇల్లు చూసినా దాదాపు తాళం వేసే కనిపిస్తుంది. వృద్ధులు, చిన్నపిల్లలు తప్ప గ్రామంలో సంక్రాంతికి పెద్దగా ఎవరూ కనిపించరు. పండుగ వస్తేచాలు పట్టణం నుంచి ప్రతి ఒక్కరు పల్లె బాట పడితుంటే, ఈ పల్లె ప్రజలు మాత్రం పట్టణ బాట పడతారట… గంగిరెద్దులు ఆడించుకునే కుటుంబాలు ఈ గ్రామంలో అత్యధికంగా ఉండడం వల్లే ప్రతి సంక్రాత్రి పండుగకి వారందరూ పట్టణాలకు పయనమవుతారట.

సంక్రాంతి పండుగ వస్తే చాలు గ్రామీణ ప్రాంతాలన్నీ కళకళలాడతాయి. పట్టణం నుంచి తమ సొంత ప్రాంతాలకు ప్రజలు పల్లెబాట పడతారు. మూడు రోజులు పాటు జరిగే సంక్రాంతి పండుగను గ్రామాల్లో అట్టహాసంగా జరుపుకుంటారు. రకరకాల ముగ్గులు, గాలిపటాల పోటీలు, కోడి పందాలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి సందడి అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని పల్లె ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రకాశం జిల్లాలో ఆ గ్రామంలో మాత్రం ప్రతి సంక్రాంతికి ఆ గ్రామస్తులు గ్రామానికి దూరమవుతారు. పల్లె నుంచి పట్టణం బాట పడతారు. దీంతో ఆ గ్రామంలో సంక్రాంతి పండుగ శోభ అసలు కనిపించదు.

గంగిరెద్దులాడించుకునే 200 కుటుంబాలు ప్రతి సంక్రాంతి పండుగకు పట్టణ ప్రాంతానికి వెళ్లి తమ కులవృత్తి అయిన గంగిరెద్దులను ఆడించుకొని అరకోర సంపాదించుకొని పండగ తర్వాత తిరిగి తమ గ్రామానికి వస్తారు. ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల ప్రతి సంక్రాంతికి గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంటుందని గ్రామంలోని వృద్ధులు చెబుతున్నారు. కేవలం గ్రామంలో వృద్ధులు, చిన్నపిల్లలు మాత్రమే గ్రామంలో ఉంటారని అంటున్నారు. అందువల్ల తమ గ్రామంలో సంక్రాంతి పండగ సందడి ఉండదని తెలిపారు. అందరూ బెంగళూరు, మైసూరు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్తారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.