AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆడపిల్లను అమ్మకానికి పెట్టిన దుర్మార్గుడు.. ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..

మూడు కేజీల ఆడపిల్ల రేటు రూ. మూడు లక్షలు, జననధృవపత్రం కూడా వారి సొంత ఇంటి పేరుమీద ఇప్పిస్తామని మెసేజ్ చేసింది. అయితే వాట్సప్ మెసేజ్ చూసిన అమృత రావు ఏదో గ్రూప్‌లోకి పంపించబోయి తన చిన్ననాటి..

Andhra Pradesh: ఆడపిల్లను అమ్మకానికి పెట్టిన దుర్మార్గుడు.. ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..
Selling Girl Child In Vijayawada
Sanjay Kasula
|

Updated on: Jun 01, 2022 | 3:44 PM

Share

ఆడపిల్లలకు పురిట్లో మొదలు ముసలితనం వరకు కష్టాలు తప్పడం లేదు. స్త్రీని దేవతగా పూజించే మన దేశంలో అక్కడక్కడ ఆడపిల్ల అంగట్లో సరుకుగా మారిపోయింది. హాయిగా తల్లిఒడిలో సేదదీరాల్సిన చిట్టితల్లు డబ్బులిచ్చిన వారి చేతుల్లోకి చేరిపోతున్నారు. ఒకటికాదు రెండు కాదు వారం రోజుల్లో ఏడుగురి చేతులు మారింది. ఒక్కరు కూడా ఆ పసిపాప బోసినవ్వులకు మురిసిపోలేదు. అయ్యేపాపం అనుకోలేదు. డబ్బులు, లాభం గురించే ఆలోచించారు తప్ప.. మనుషులం అనే సంగతి మర్చిపోయారు. కానీ పేగుబంధం గట్టిదికదా.. పోలీసుల చొరవతో తిరిగి తల్లి చెంతకు చేరింది. సంతానం లేని వారు పిల్లలను దత్తత తీసుకునేందుకు బ్రోకర్లను ఆశ్రయిస్తుంటారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న బ్రోకర్లు పేదల పిల్లలను అమ్మేందుకు సరికొత్త దందా తెరలేపారు. ఇప్పటి వరకు చాలిచాలని ఆదాయంతో అనేక మంది తమ పిల్లలను విక్రయిస్తున్న ఘటనలు కోకొల్లలు చూశాం.. ఇప్పుడు ఏకంగా ఆర్ఎంపీలు, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు శిశు విక్రయాలకు తెగబడుతున్న ఉందంతాలు వెలుగు చూస్తున్నాయి.

ఈ దందా ఏ స్థాయికి చేరిందంటే.. సోషల్ మీడియా వేదికగా మూడు కేజీల ఆడపిల్ల రేటు రూ. మూడు లక్షలు అంటూ వాట్సప్ గ్రూపులో ప్రచారం మొదలుపెట్టారు. అది కాస్త వైరల్ అవడంతో  ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ నగరానికి చెందిన చావల అమృత రావు , జీ. కొండూరు మండలంలోని కవులూరు అనే గ్రామంలో ఆర్ఎంపీ. అయితే అమృతరావుకు గతంలో ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేసిన నగరంలోని మధ్యకట్ట ప్రాంతానికి చెందిన పుష్పలత అనే మహిళ నుంచి ఒక ముద్దులొలికే ఆడపిల్ల ఫోటోతో పాటు వీడియోని అమృత రావుకి పంపించింది.

ఆ ఫోటో కింద మూడు కేజీల ఆడపిల్ల రేటు రూ. మూడు లక్షలు, జననధృవపత్రం కూడా వారి సొంత ఇంటి పేరుమీద ఇప్పిస్తామని మెసేజ్ చేసింది. అయితే వాట్సప్ మెసేజ్ చూసిన అమృత రావు ఏదో గ్రూప్‌లోకి పంపించబోయి తన చిన్ననాటి పాఠశాల స్నేహితుల వాట్సప్ గ్రూప్ అయిన ఆర్ఎంహెచ్ఎస్ క్లాస్మెట్స్ ఆప్ 1991 అనే గ్రూపులోకి పంపించాడు. అయితే అదే గ్రూప్ లోని కొంత మంది ఆ వాట్సప్ ఫోటోలను, మెసేజ్ను చూసి కంగుతిన్నారు. అమృత రావు నుంచి ఇలాంటి మెసేజ్ వచ్చింది ఎంటి అంటూ ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

విషయం ఆ నోటా, ఈ నోటా చేరింది. అయితే చిన్నారిని అమ్మకానికి ఉంచారన్న విషయం పలు వాట్సప్ గ్రూపుల్లో వైరల్‌గా మారి చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం అందింది.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అసలు ఆ గ్రూపులో ఎవరు పంపించారని ఆరా తీయగా అమృతరావు అని తెలుసుకుని అతడిని అరెస్టు చేశారు.

అయితే అసలు అమృతరావుకు చిన్నారి ఫోటోతో పాటుగా చిన్నారిని అమ్మేందుకు రేటు నిర్ణయించిన ఆర్ఎంపీ వైద్యురాలు పుష్పలతని కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిద్దరూ అజితీసింగ్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. అసలు సూత్రధారులు ఎవరు.. అయితే జిల్లాలో చిన్నారులను అక్రమంగా విక్రయిస్తున్న దందాలో అసలు సూత్రధారులు ఎవరు అనే సందేశాలు కలుగుతున్నాయి.

ఎందుకంటే ప్రస్తుతం చిన్నారిని అమ్మేందుకు వాట్సప్ గ్రూపులో ఫోటోలు, రేటు నిర్ణయించిన అమృతరావు.. పుష్పలతలు కేవలం పాత్రదారులేనన్న విషయం అర్ధమవుతోంది. దాని వెనక నగరంలోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అనైతికంగా పిల్లలను కని ఆసుపత్రుల్లోనే వదిలివేయడం.. మరికొంతమంది డబ్బు ఆశతో చిన్నారులను విక్రయించేందుకు ముందుకు రావడం ఆసుపత్రుల యాజమాన్యాలకు బ్రోకర్లకు కాసుల పంట పండిస్తుంది.

ప్రస్తుతం వాట్సప్ గ్రూప్ లో అమ్మకానికి పెట్టిన చిన్నారి ఎవరు.. ఆ చిన్నారి ఎక్కడ ఉంది. ఆమ్మకానికి పెట్టిన అసలు సూత్రధారులు ఎవరనే విషయంపై పోలీసులు విచారణ చేస్తే పలు ఆసక్తికర విషయాలతో పాటుగా, శిశు విక్రయాల దందాలో అసలు సూత్రధారులు ఎవరన్న విషయాలు కూడా వెలుగుచూస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.