Visakhapatnam: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. 5 జీ సేవలు ప్రారంభించిన ఎయిర్ టెల్.. ఆ ప్రాంతాల్లో మాత్రమే..

విశాఖ నగర వాసులకు ప్రముఖ టెలీ కమ్యూనికేషన్ సంస్థ భారతీ ఎయిర్ టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. అత్యాధునిక 5జీ సేవలను గురువారం (నిన్న) నుంచి స్టార్ట్ చేసినట్లు వెల్లడించింది. దశల వారీగా వినియోగదారులకు...

Visakhapatnam: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. 5 జీ సేవలు ప్రారంభించిన ఎయిర్ టెల్.. ఆ ప్రాంతాల్లో మాత్రమే..
Visakhapatnam
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 23, 2022 | 9:49 AM

విశాఖ నగర వాసులకు ప్రముఖ టెలీ కమ్యూనికేషన్ సంస్థ భారతీ ఎయిర్ టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. అత్యాధునిక 5జీ సేవలను గురువారం (నిన్న) నుంచి స్టార్ట్ చేసినట్లు వెల్లడించింది. దశల వారీగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ సీఈవో శివన్‌ భార్గవ చెప్పారు. తమ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన 18వ నగరంగా విశాఖపట్నం అని ఎయిర్‌టెల్ పేర్కొంది. ప్రస్తుతం విశాఖలోని ద్వారకానగర్, బీచ్ రోడ్డు, దాబా గార్డెన్స్, గాజువాక జంక్షన్, ఎంవీపీ కాలనీ, రాంనగర్, తేన్నేటి నగర్, మద్దిలపాలెం, వాల్దేర్ అప్‌ల్యాండ్స్, పూర్ణా మార్కెట్, రైల్వే స్టేషన్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది ఎయిర్‌టెల్ సంస్థ పేర్కొంది. 5జీ నెట్‌వర్క్‌ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేంత వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా హై స్పీడ్‌ ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ నెట్‌వర్క్‌ని ఉచితంగా పొందవచ్చని సీఈవో శివన్‌ వివరించారు.

కాగా.. దేశంలో ప్రస్తుతం 4జీ సేవలు కొనసాగుతున్నాయి. 5 జీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వినియోగదారుల కల నెరవేరుతోంది. ఇక ఇతర నెట్‌వర్క్‌ల కంటే జియో మరింతగా దూసుకుపోతోంది. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సేవలు అందిస్తోంది. ఇక జియో ఐఫోన్‌ 12, తర్వాత వెర్షన్‌ మొబైల్‌ ఉన్నవారికి అపరిమిత డేటాలో 5జీ సేవలను ప్రారంభించింది. ఐఫోన్‌ 12 మినీ, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రో, ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 12 మ్యాక్స్‌, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ ఉన్న వారు జియో 5జీ సేవలను యాక్సెస్‌ చేసుకోవాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..