AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: విశాఖలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ.. భరతమాత సేవ కోసం పోటా పోటీగా..

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖలో ప్రారంభమైంది. సెప్టెంబర్ 5 వరకు జరిగే ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఉమ్మడి 13 జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరవుతున్నారు. విశాఖ పోర్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఈ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.

Vizag: విశాఖలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ.. భరతమాత సేవ కోసం పోటా పోటీగా..
Vizag
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 26, 2024 | 12:14 PM

Share

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖలో ప్రారంభమైంది. సెప్టెంబర్ 5 వరకు జరిగే ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఉమ్మడి 13 జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరవుతున్నారు. విశాఖ పోర్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఈ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. అర్ధరాత్రికి భారీగా అభ్యర్థులు చేరుకున్నారు. అయితే రాత్రి భారీ వర్షం విశాఖలో కురవడంతో.. ఫిజికల్ టెస్ట్ లో రన్నింగ్ ఈవెంట్ ను బీచ్ రోడ్డుకు మార్చారు. ప్రత్యేక బస్సుల్లో ఫోర్త్ స్టేడియం నుంచి అభ్యర్థులను బీచ్ రోడ్డుకు తరలించారు. అక్కడ బ్యాచ్‌కు 100 మంది చొప్పున 16 వందల మీటర్ల రన్నింగ్ లో ఎంపిక నిర్వహిస్తున్నారు.

అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రిటర్న్ టెస్ట్ పాస్ అయిన అభ్యర్థులు.. ఫిజికల్ టెస్ట్ కు హాజరవుతున్నారు. ఫిజికల్ టెస్ట్ పాస్ అయిన తరువాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. బీచ్ రోడ్ లో 1600 మీటర్ల రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు.. మళ్లీ పోర్ట్ స్టేడియం కు తరలిస్తున్నారు. అక్కడ ఫిజికల్ టెస్ట్ లోని పరీక్షలు నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ జరిగే ప్రాంతంలో యాంబులెన్స్లు, మెడికల్ వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి మేజర్ శశాంక్ ఎంపికల ప్రక్రియలను పర్యవేక్షిస్తున్నారు.

అగ్నివీర్ ఫిజికల్ టెస్ట్ కోసం అభ్యర్థులు భారీగా హాజరవుతున్నారు. రోజుకు 1000 మంది చొప్పున అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. తొలి రోజు 876 మంది హాజరయ్యారు. ఎలాగైనా ఈ సెలక్షన్స్ లో పాసై.. నాలుగేళ్లపాటు దేశానికి సేవ చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు అభ్యర్థులు. బీచ్ రోడ్ లో 1600 మీటర్ల ఫిజికల్ రన్నింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పది రోజులపాటు సాగే ఈ ర్యాలీలో.. వర్షం కురిస్తే బీచ్ రోడ్లో రన్నింగ్ నిర్వహిస్తారు. లేకుంటే ఫోర్త్ స్టేడియం లోనే ఫిజికల్ టెస్ట్ కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కచ్చితంగా అభ్యర్థులు తీసుకురావాల్సి ఉంటుందని అంటున్నారు అధికారులు.