Kesineni Nani: చంద్రబాబు పచ్చి మోసగాడు.. జగన్‌ పేదల పక్షపాతి.. టీడీపీని వీడుతూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..

కేశినేని నాని, కేశినేని చిన్ని మధ్య మొదలైన చిన్న వివాదం కాస్తా చినికి చినికి గాలివానగా మారింది. చివరకు కేశినేని నాని టీడీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులుగా టీడీపీలో జరిగిన పరిణామాల పట్ల ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.. తనకు విజయవాడ ఎంపీ సీటు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సానుకూలంగా లేదని సంకేతాలు రావడంతో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు.

Kesineni Nani: చంద్రబాబు పచ్చి మోసగాడు.. జగన్‌ పేదల పక్షపాతి.. టీడీపీని వీడుతూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..
Kesineni Nani
Follow us

|

Updated on: Jan 10, 2024 | 5:37 PM

కేశినేని నాని, కేశినేని చిన్ని మధ్య మొదలైన చిన్న వివాదం కాస్తా చినికి చినికి గాలివానగా మారింది. చివరకు కేశినేని నాని టీడీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులుగా టీడీపీలో జరిగిన పరిణామాల పట్ల ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.. తనకు విజయవాడ ఎంపీ సీటు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సానుకూలంగా లేదని సంకేతాలు రావడంతో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. తిరువూరులో చంద్రబాబు సభ ఏర్పాట్లలో జరిగిన గొడవ అనంతరం.. ఇక టీడీపీలో ఉండబోనంటూ కేశినేని నాని కుటుంబం నిర్ణయం తీసుకుంది. కేశినేని భవన్‌కి ఫ్లెక్సీలను సైతం తొలగించారు. ఈ క్రమంలో అంతా అనుకున్నట్లుగానే.. కేశినేని నాని బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. లేటెస్ట్‌గా వైసీపీ అధినేత సీఎం జగన్‌తో కేశినేని నాని భేటీ అయ్యారు. జగన్‌తో మీటింగ్‌కి ముందు నానితో వెల్లంపల్లి, అయోధ్యరామిరెడ్డి, దేవినేని అవినాష్‌ భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి జగన్ తో నాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానంగా వైసీపీలో చేరికపై సీఎం జగన్‌తో చర్చలు జరిపారు.. అంతేకాకుండా పార్టీలో ప్రాధాన్యత తదితర అంశాలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ విరుచుకుపడ్డారు. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టారని.. సొంత కుటుంబ సభ్యులతో కొట్టించాలని చూశారని మండిపడ్డారు. ఇకపై తన రాజకీయ ప్రయాణం వైసీపీతోనేనని కేశినేని నాని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదని.. విజయవాడ అభివృద్ధికి కనీసం రూ.100 కోట్లు ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. తన విషయంలో టీడీపీ ప్రొటోకాల్ ను విస్మరించిందని.. నాని పేర్కొన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అంటూ కొనియాడారు. చంద్రబాబు ఏపీకి అవసరం లేని వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు.

వీడియో చూడండి..

చంద్రబాబు మోసగాడని ఈ ప్రపంచానికి తెలుసు.. కానీ ఇంత మోసం చేస్తారని తెలియదంటూ కేశినేని నాని పేర్కొన్నారు. తనకు విజయవాడ అంటే పిచ్చి ప్రేమని.. తాను ఎవరిని సీట్ ఇవ్వమని అడగలేదని పేర్కొన్నారు. టీడీపీ, జనసేనకు 40 సీట్లకంటే ఎక్కువ రావంటూ కేశినేని పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..