Sankranti Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. ఆ రూట్లలో..

సంక్రాంతి పండుగ సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఐదు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Sankranti Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. ఆ రూట్లలో..
Sankranti Special Trains
Follow us
Janardhan Veluru

|

Updated on: Jan 10, 2024 | 5:53 PM

సంక్రాంతి పండుగ సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఐదు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాచిగూడ-తిరుపతి ప్రత్యేక రైలు (నెం.07041) జనవరి 12న రాత్రి 08.25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.00 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అలాగే తిరుపతి – కాచిగూడ ప్రత్యేక రైలు (నెం.07042) జనవరి 13న రాత్రి 07.50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.50 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఉందానగర్, షాద్ నగర్, జడ్చెర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రైచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుండ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్‌లు ఉంటాయి.

అలాగే తిరుపతి – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (నెం.07060) జనవరి 12న రాత్రి 08.25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు రేణిగుంట జంక్షన్, గూడూరు జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి జంక్షన్, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగనుంది. ఈ ప్రత్యేక రైలులో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లార్, జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్‌లు ఉంటాయి.

అలాగే హెచ్.ఎస్.నాందేడ్-కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (నెం.07487) జనవరి 15న మధ్యాహ్నం 02.25 గంటలకు హెచ్.ఎస్.నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.10 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. కాకినాడ టౌన్ – హెచ్.ఎస్.నాందేడ్ ప్రత్యేక రైలు (నెం.07488) జనవరి 16న సాయంత్రం 06.30 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలేరి మరుసటి రోజు మధ్యాహ్నం 03.10 గంటలకు హెచ్.ఎస్.నాందేడ్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు మడ్‌ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొండపల్లి, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్ స్టేషన్లలో ఆగనుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్‌లు ఉంటాయి.

హైదరాబాద్-నర్సాపూర్ మధ్య రెండు ప్రత్యేక సర్వీసులు..

అలాగే హైదరాబాద్-నర్సాపూర్ మధ్య రెండు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ద.మ.రైల్వే శాఖ ప్రకటించింది. హైదరాబాద్-నర్సాపూర్ ప్రత్యేక రైలు నెం.07058 జనవరి 15న రాత్రి 11.10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.35 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్, జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగనుంది. అలాగే నర్సాపూర్- హైదరాబాద్ ప్రత్యేక రైలు నెం.07059 జనవరి 16న సాయంత్రం 06.00 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 04.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగనుంది. ఈ రెండు ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (నెం.07066) ఇవాళ (జనవరి 10) సాయంత్రం 07.00 గంటలకు బదులు గంటన్నర ఆలస్యంగా 08.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనుందని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఆలస్యంగా బయల్దేరనున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్..

అటు పొగమంచు కారణంగా ఉత్తరాదిలో పలు రైల్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్ – న్యూ ఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.12723) గురువారం ఉదయం 06.00 గంటలకు బదులు ఐదు గంటలు ఆలస్యంగా 11.00 గంటలకు బయలుదేరి వెళ్లనుంది.

సికింద్రాబాద్ – రామనాథపురం ఎక్స్‌ప్రెస్ (రైలు నెం.07695) ఇవాళ (జనవరి 10) రాత్రి 09.10 గంటలకు బదులు 11వ తేదీన వేకువజామున 03.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనుంది.