AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జత్వానీ కేసులో కాంతిరాణా టాటాకు స్వల్ప ఊరట

జత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ కాంతిరాణా టాటాకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌పై విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేసిన కోర్టు.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇదే కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్ కస్టడీ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది.

Andhra Pradesh: జత్వానీ కేసులో కాంతిరాణా టాటాకు స్వల్ప ఊరట
Kanthi Rana Tata
Ram Naramaneni
|

Updated on: Sep 25, 2024 | 9:46 AM

Share

ముంబై నటి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జత్వానీ కేసులో సస్పెండ్‌ అయిన అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ ముందస్తు బెయిల్‌ కోరతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కూడా తదుపరి విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేసిన హైకోర్టు… కౌంటర్‌ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే రిలీఫ్‌ కోసం కాంతిరాణా టాటా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కాంతిరాణా టాటాకు స్వల్ప ఊరట లభించింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కాంతిరాణా వేసిన పిటిషన్‌ వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు కాంతిరాణా టాటాపై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. అయితే ప్రోపర్టీ డాక్యుమెంట్స్ ,ఆధార్ ఫాబ్రికేట్ చేసి.. ఫాల్స్ కేసు పెట్టి వేధించారని జత్వానీ తరపు అడ్వకేట్స్ వాదించారు.కేసు విషయంలో కుట్ర జరిగిందని.. ఎవిడెన్స్ టెంపరింగ్ చేశారని కోర్టుకు తెలిపారు జత్వానీ తరపు లాయర్లు.

ఇక ఈ కేసులో ఎ1 నిందితుడు , YCPనేత కుక్కల విద్యాసాగర్‌ ను ఇప్పటికే పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో విజయవాడ ఫోర్త్‌ అడిషనల్‌ జ్యూడిషియల్‌ కోర్టు విద్యాసాగర్‌ను అక్టోబర్‌ 4వరకు రిమాండ్‌కు పంపింది. విద్యాసాగర్‌ను పూర్తి స్థాయిలో విచారిస్తే మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం వుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో నటి జత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న విద్యాసాగర్‌ను 5 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్‌ వేశారు. కస్టడీ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..