Chandra Babu Naidu: చంద్రబాబు నాయుడిపై రజనీకాంత్ అలా మాట్లాడటంలో తప్పు లేదు.. సుమన్ కీలక వ్యాఖ్యలు
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడ్ని పొగుడుతూ తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రసంగించారు. అయితే దీనిపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడ్ని పొగుడుతూ తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రసంగించారు. అయితే దీనిపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. చంద్రబాబు నాయుడిపై రజనీకాంత్ చేసిన ప్రసంగంలో తప్పేమీ లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి కొత్త రూపం తీసుకొచ్చింది చంద్రబాబేనంటూ వ్యాఖ్యానించారు. ప్రధాన రూపశిల్పి ఆయనే అంటూ తెలిపారు.
శంషాబాద్ విమానాశ్రయం, ఐటీ రంగం రావడంతో ఇంతమంది ఉపాధి పొందుతున్నారంటే అవన్నీ చంద్రబాబు వేసిన ప్రణాళికే వల్లే జరిగిందని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఒడుదొడుకులు ఉంటాయని.. ఆయన మంచి ముఖ్యమంత్రి అంటూ సుమన్ ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే రజనీకాంత్ తన ప్రసంగంలో ఏ పార్టీని, నాయకుడ్ని కూడా విమర్శించలేదని చెప్పారు. సీఎం జగన్ గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురానప్పటికీ.. వైకాపా నేతలు మాత్రం ఆయన్ను విమర్శించారని ఇలా చేయడం సరికాదన్నారు. సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..