Nagababu: టీటీడీ చైర్మన్ పదవి ప్రచారంపై స్పందించిన నాగబాబు.. ఏమన్నారంటే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీకి బీజేపీ, జనసేన సీట్లు తోడయ్యాయి. ఇక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయగా, పార్టీ గెలుపు కోసం నటుడు, జనసేన నేత నాగబాబు కూడా కృషి చేశారు. ఈ సందర్భంగా నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీటీడీ చైర్మన్ పదవీని ఆశిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఖండించారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీకి బీజేపీ, జనసేన సీట్లు తోడయ్యాయి. ఇక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయగా, పార్టీ గెలుపు కోసం నటుడు, జనసేన నేత నాగబాబు కూడా కృషి చేశారు. ఈ సందర్భంగా నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీటీడీ చైర్మన్ పదవీని ఆశిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఖండించారు. నాకు ఏ పదవి మీద ఆశ లేదు.. నేను ఏ పదవి ఆశించడం లేదని ప్రకటించారు. అలాగే నేను ఉన్నత వరకు జన సేన పార్టీకి అండగా ఉంటానని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ అవుతారని ప్రచారం నేపథ్యంలో నాగబాబు వివరణ ఇచ్చారు.

Nagababu Post
ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారి చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి కుటుంబం మొత్తం సంబరాలు చేసుకున్నారు. పవన్ కల్యాణ్‌కు కుటుంబ సభ్యులంతా సాధారణంగా స్వాగతం పలికారు. అయితే జన సేన విజయం సాధించిన ఆనందంలో కుటుంబ సభ్యులం అందరం ఒక దగ్గర కలిశామని నాగబాబు అన్నారు.
