సాగర తీరంలో సాగర కన్యలు.. మైమరిచిపోతున్న విశాఖ వాసులు..!
ఏమో ఎగిరే చేపలు ఉన్నట్లే మత్స్య కన్యలు ఉండవచ్చంటున్నారు కొందరు. అంతు పట్టని సాగరాల్లో అంతుపట్టని జీవజాలం ఉన్నాయంటుంటారు జీవ శాస్త్రవేత్తలు. తాతలు, ముత్తాతలు జలకన్యలపై చెప్పిన కథలకు లెక్కేలేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు. దివి నుంచి భువికి దిగివచ్చిన జల కన్యల్లా..!

విశాఖపట్నం సాగర నగరంలో సాగర కన్యలు. ఎస్.. పొట్ట నుంచి తల వరకు మనిషి శరీరం.. నడుము కింది భాగమంతా చేపను పోలిన ఆకృతి.. ఏదో సినిమా గుర్తొస్తుంది కదూ.. అవును అటువంటి సాగర కన్యలను రియల్ గా ఎప్పుడైనా చూసారా..? జలాల్లో జలకాలాడుతున్న ఆ అందమైన ఆ జల కన్యల విశేషాలను మీరూ తెలుసుకోండి.
జలకన్యలు.. మత్స్య కన్యలు.. సాగర కన్యలు.. ప్రపంచవ్యాప్తంగా అనేక పుస్తకాల్లో… అద్భుత గాథల్లో వర్ణింపబడ్డ నాయికలు. ఈ మూడు కన్యల్లో మత్స్య రూపం సాధారణం. శరీరంలో సగభాగం మానవ రూపాన్ని సగం మత్స్య రూపాన్ని కలిగివుండటం ఈ మత్స్య కన్యల ప్రాథమిక లక్షణం. తల నుంచి నడుము వరకు మనిషి రూపాన్ని.. నడుము నుంచి చేపలా తోక ఉంటుంది. జలకన్యలు నిజంగా ఉన్నాయో లేదో తెలియదు కానీ.. ఈ సాగర కన్యల గురించి పుంకాలు పుంకాలుగా కథలైతే ఉన్నాయి.
ఏమో ఎగిరే చేపలు ఉన్నట్లే మత్స్య కన్యలు ఉండవచ్చంటున్నారు కొందరు. అంతు పట్టని సాగరాల్లో అంతుపట్టని జీవజాలం ఉన్నాయంటుంటారు జీవ శాస్త్రవేత్తలు. తాతలు, ముత్తాతలు జలకన్యలపై చెప్పిన కథలకు లెక్కేలేదు. జలకన్యల కథ ఇతివృత్తాంతంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహస వీరుడు సాగర కన్య సినిమా అత్యంత ప్రజాదరణ పొందింది. ఆ మూవీని చూసేందుకు జనం క్యూ కట్టారు. సాగర కన్యలు ఉన్నారన్న చర్చను, ఊహగానాలకు తెరతీసిందీ ఈ చిత్రం.
ప్రస్తుతం చూస్తున్నది కథ కాదు.. ప్రత్యక్షంగా కనిపిస్తున్న సాగర కన్యలు వీళ్లు..! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు. దివి నుంచి భువికి దిగివచ్చిన జల కన్యల్లా.. అందమైన రూపుతో.. జలాల్లో అద్భుతంగా విహహరిస్తూ సందడి చేస్తున్నారు.
విశాఖలోని బీచ్‌కు ఆనుకుని ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో ఏర్పాటయింది ఈ ప్రదర్శన. ప్రతి ఏట డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న నిర్వాహకులు.. ఈసారి జలకన్యలను సందర్శకులకు పరిచయం చేశారు. అయిదుగురు విదేశీ వనితలు ఇదిగో ఇలా జలకన్యవలే ముస్తాబై అందరికీ ఆహ్లాదాన్ని పంచుతున్నారు. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ నీటిలో విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ జల కన్యల్లో విశేషమేమిటంటే వీరు ఆక్సిజన్ గొట్టాలు ముక్కుకు అమర్చుకోకపోవడం.
జల కన్యలు ఉంటారని సినిమాలు, కథల్లో చెప్పుకోవటం తప్ప.. నేరుగా ఎవరూ చూసింది లేదు. అయితే అప్పడప్పుడు సోషల్ మీడియాలో జలకన్యలు అంటూ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ చూస్తూ ఉన్నాం. నడుం వరకు చేప ఆకారం ఉండి అందమైన అమ్మాయిలను జలకన్యల థీమ్ తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీంతో కేరింతల కొడుతున్నారు జనం. పిల్లలు పెద్దలు ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకుంటూ.. ఎంజాయ్ చేస్తున్నారు.
నీటిలో ఊపిరి దిగబట్టి దాదాపుగా రెండున్నర నిమిషాల పాటు ఉంటారు. ఈ క్రమంలో అనేక సవాళ్లను అదిగమంచి ప్రదర్శన చేస్తూ ఉంటారు. ప్రదర్శన చేసే ముందు వ్యాయామంతో పాటు, బ్రీత్ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. వాటర్ డ్రైవింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వీళ్లంతా.. దేశ విదేశాలు తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తుంటారు. అయితే వీరిలో హాబీగా ఎంచుకుని ప్రదర్శనలు ఇస్తూ ఉంటే.. మరికొందరు కుటుంబ పోషణకు ఈ ప్రదర్శనలు చేస్తుంటారు. ఈ జలకన్యలను చూసేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. ఇది అద్వితీయమైన అనుభవమని చెబుతున్నారు.
ఇది వెరైటీ కాన్సెప్ట్‌తో కూడిన థీమ్. విదేశాల్లో ముఖ్యంగా సముద్ర ప్రాంతాలను కలిగి ఉన్న దేశాల్లో జలకన్యల థీమ్ చాలా ఫేమస్. ఇలాంటి థీమ్ ఎగ్జిబిషన్ ఇప్పుడు విశాఖలోనూ అలరిస్తోంది. సాగర తీరం ప్రజలకు సరికొత్తగా సాగర కన్యలను పరిచయం చేసేందుకు ఈ సెట్‌ను ఏర్పాటు చేశామంటున్నారు నిర్వాహకులు.
ఎంతో నైపుణ్యం కలిగిన ఈ మెర్మయిడ్ డైవర్స్ నీటి లోపల ఉంటూ ఈత కొడుతూ చిన్నారులను అమితంగా ఆకట్టుకుంటున్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఈసారి సమ్మర్‌కు ఇదే స్పెషల్ ఎట్రాక్షన్. ఈ ఎగ్జిబిషన్ మూడు నెలలు పాటు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం … జలకన్యలు చూడాలనుకుంటే విశాఖను సందర్శించాల్సిందే. వీడియో చూడండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
