CBSE Board Exams 2025: 42 లక్షల మంది విద్యార్థులకు బోర్డు పరీక్షలు షురూ.. భారత్ సహా 27 దేశాల్లో పరీక్ష కేంద్రాలు
2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్సీ పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న నుంచి ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హజరవుతున్నారు. భారత్ సహా 27 దేశాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి..

హైదరాబాద్, ఫిబ్రవరి 15: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. భారత్ సహా 27 దేశాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. తొలిరోజు పదో తరగతి ఇంగ్లిష్ సబ్జెక్టు, 12వ తరగతికి ఆంత్రప్రెన్యూర్‌షిప్ సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. నేటి నుంచి ఆయా తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి పదో తరగతి విద్యార్థులు సుమారు 50 వేల మంది, 12వ తరగతి విద్యార్థులు దాదాపు 10 వేల మంది పరీక్షలకుపైగా విద్యార్ధులు హాజరుకానున్నారు. వీరిలో 80 శాతం మంది విద్యార్ధులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదో తరగతి విద్యార్థులు దాదాపు 40 వేలు, 12వ తరగతి విద్యార్ధులు 12 వేల మంది వరకు ఉన్నారు.
కాగా ఇప్పటికే సీబీఎస్సీప్రాక్టికల్ పరీక్షలు జనవరిలో ముగియగా.. 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించిన థియరీ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాక్టికల్/ప్రాజెక్ట్/ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు సంబంధించి మార్కులను అప్‌లోడ్ చేసేటప్పుడు పాఠశాలలు కొన్నిసార్లు తప్పులు చేస్తున్నాయని, ఈ సారి ఈ విధమైన తప్పులు చోటు చేసుకోకుండా.. ఆయా పాఠశాలలకు ప్రాక్టికల్, ప్రాజెక్ట్, అంతర్గత మూల్యాంకనం, థియరీ పరీక్షలను సజావుగా నిర్వహించడంలో సహాయపడటానికి సబ్జెక్టుల జాబితా సమాచారం వివరాలను కూడా బోర్డు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.
సీమ్యాట్ 2025 తుది ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్) 2025 తుది ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) విడుదల చేసింది. మొత్తం 74,012 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 63,145 అంటే 85.32 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. జనవరి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదలైంది. జనవరి 2 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా జనవరి 25న 107 నగరాల్లో రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




