Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ ప్రాంతంలో డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. గుట్టు బయటపడిందిగా…

రాష్ట్రంలో గంజాయి నియంత్రణ కోసం ఈగల్‌ ప్రత్యేక విభాగం సమర్థవతంగా పనిచేస్తోంది. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే.. నిఘా ముమ్మరం కావడంతో స్మగ్లర్లు కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు. కానీ.. అలాంటి వాటికి కూడా డ్రోన్ కెమెరాలతో చెక్‌ పెడుతున్నాయి.

Andhra Pradesh: ఆ ప్రాంతంలో డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. గుట్టు బయటపడిందిగా...
Ap Police Drone
Follow us
Ch Murali

| Edited By: Balaraju Goud

Updated on: Feb 15, 2025 | 4:14 PM

గంజాయి విక్రయాలు.. వాడకాలపై ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉన్నా .. మీ మాట మీదే.. మా దారి మాదే అంటున్నారు స్మగ్లర్లు.. నిత్యం నిఘా ఉన్నా కొత్తదారుల్లో రవాణా.. అమ్మకాలు.. వాడకం.. జరుగుతూనే ఉన్నాయి.. అలా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న దందాను టెక్నాలజీ సాయంతో నెల్లూరు పోలీసులు చెక్ పెట్టారు. నేరుగా వెళితే పోలీసులపై దాడులకు తెగబడేంతగా తిగించిన ముఠాలు రాష్ట్రంలో చాలా చోట్ల దండాలు చేస్తున్నాయి. తాజాగా బయట పడ్డ గంజాయి డెన్ లాంటివి నెల్లూరులో ఇంకా ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

నెల్లూరు గంజాయి రవాణాకు స్టాక్ పాయింట్‌గా మారిందన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఒరిస్సాతోపాటు ఏపీలోని విశాఖ ప్రాంతాల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నిత్యం గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తరచూ హైవేపై పోలీసుల తనిఖీల్లో విలువల కొద్దీ పట్టుబడుతున్న గంజాయి నిల్వలే అందుకు నిదర్శనం. గంజాయి రవాణా స్టార్టింగ్ పాయింట్ నుంచి డెలివరీ పాయింట్ వరకు నేరుగా ఒకేసారి సరఫరా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే నిత్యం వాటిపై నిఘా ఉండడం. విశాఖ నుంచి నేరుగా ఒక్కసారిగా తమిళనాడు లేదా కర్ణాటక లకు తరలించడం సాధ్యం కాకపోవడంతో నెల్లూరును స్టాక్ పాయింట్‌గా ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి అనువైన రోజున ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది గంజాయి మాఫియా.

ఈ క్రమంలోనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. ఇటీవల నెల్లూరు నగరంలో గంజాయి వాడకం ఎక్కువ కావడంతో నిత్యం ఏదో ఒకచోట అల్లర్లు, ఘర్షణలు, హత్యలకు కూడా దారి తీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇందులో భయానకరమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో విద్యార్థులు కూడా గంజాయి బానిసలుగా మారుతున్నారు. నెల్లూరు పోలీసులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో గంజాయి సేకరిస్తున్నది అధిక సంఖ్యలో విద్యార్థులుగా గుర్తించి పోలీసులే షాక్ అయ్యారు.

నిత్యం నిఘా ఉంచిన గంజాయి విక్రయాలు ఎక్కడ జరుగుతున్నాయి. ఎక్కడినుంచి కొనుగోలు చేస్తున్నారు. గంజాయి సేవించడం అనేది ఎక్కడ జరుగుతుంది అన్న విషయంలో పోలీసులు చాలా రోజులుగా సమాచారం రాబట్ట లేకపోయారు. తాజాగా నెల్లూరు నగరంలోని మూతపడ్డ ట్రస్ట్ హాస్పిటల్ ఆవరణలో స్మైలింగ్ సహా గంజాయి సేవించే వారు అధికంగా వస్తూ పోతున్నట్లు గుర్తించారు. నేరుగా అక్కడకు పోలీసులు వెళ్లాలంటే దాడులకు తెగబడే అవకాశం ఉంది. అలాగని ఫార్మర్లను పంపిన కూడా ప్రమాదం. కాబట్టి అక్కడ గంజాయి జాడ నిర్ధారించుకునేందుకు నెల్లూరు పోలీసులు టెక్నాలజీని ఉపయోగించారు.

డ్రోన్ల సాయంతో ఆ పరిసరాలన్నీ వీడియో రికార్డ్ చేసి అక్కడ అనుమానిత వ్యక్తులు వస్తూపోతుండడం అలాగే గంజాయి సేవిస్తున్న విషయాన్ని నిర్ధారించుకున్నాక పోలీసులు ఒక్కసారిగా రైడ్ నిర్వహించారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకడు.. సజ్జా సాయి. ఆటోడ్రైవర్‌గా ఉన్న సాయి నెల్లూరులో గంజాయి పెడలర్ గా వ్యవహరిస్తున్నాడు. అజీజ్ అనే మరో వ్యక్తి ఒరిస్సా నుంచి భారీగా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఇక తోసిఫ్ అనే వ్యక్తి ఈ ఇద్దరి నుంచి తీసుకుని గంజాయి అమ్ముకుంటున్న వ్యక్తిగా గుర్తించారు.

పోలీసులు జరిపిన దాడుల్లో ముగ్గురి నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు నిత్యం గంజాయి సేవిస్తున్న వారిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్టు గుర్తించారు. వారందరికీ తల్లిదండ్రుల సమావేశంలో కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారిపై ఎవరెవరు అక్కడికి వచ్చి గంజాయి కొనుగోలు చేస్తున్నారో వారందరిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు నెల్లూరు పోలీసులు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..