పర్యాటకుల స్వర్గ ధామంలో సూపర్.. జీఎస్టీపై ఆకట్టుకుంటున్న సైకత శిల్పం..!
నాలుగు రోజుల పాటు ఈ సైకత శిల్పం బీచ్ లో ఉంటుందని పర్యాటకులంతా ఈ సైకత శిల్పాన్ని చూడవచ్చని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. బీచ్ కు వచ్చిన పర్యాటకులు షాపింగ్ చేసేందుకు ప్రత్యేక డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. వీకెండ్స్ లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తునట్లు అధికారులు తెలిపారు.

జీఎస్టీ తగ్గింపుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. బాపట్ల జిల్లాలో అనేక బీచ్ లున్నాయి. సూర్యలంక, రామాపురం, చీరాల బీచ్ లకు పర్యాటకులు పెద్ద ఎత్తున క్యూ కడుతుంటారు. వీరందరికి తెలిసేలా సైకత శిల్పం ఏర్పాటు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ నిర్ణయించారు. వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భారీ సైకత శిల్పాలు ఏర్పాటు చేయడంతో పేరుగాంచిన విజయవాడకు చెందిన బాలాజీకి చెప్పి సైకత శిల్పం ఏర్పాటు చేయించారు. బాలాజీ రెండు రోజుల పాటు కష్టపడి అద్భుతంగా సైకత శిల్పాన్ని తీర్చి దిద్దాడు. గతంలోనూ అనేక శిల్పాలను రూపొందించిన బాలాజీ మరోసారి అందరిని కట్టిపడేసేలా శిల్పాన్ని చెక్కాడు. సైకత శిల్పంలో వివిధ రంగులను అమర్చారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ క్యాప్షన్ ను జోడించారు. ముఖ్యంగా జిఎస్టీ తగ్గింపుతో పర్యాటకులకు జరుగుతున్న మేలు తెలిసేలా పలు అంశాలను చూడచక్కగా తయారు చేశారు. వసతిపై 5%, సాధారణ రెస్టారెంట్లపై 5శాతం జిఎస్టీ విధించినట్లు తెలిసేలా ప్రత్యేక రూపొందించారు. పర్యాటకులు బొమ్మలు వారితో పాటు కారు ఏర్పాటు చేసిన విధానం చూపరులను ఆకట్టుకుంటుంది.
నాలుగు రోజుల పాటు ఈ సైకత శిల్పం బీచ్ లో ఉంటుందని పర్యాటకులంతా ఈ సైకత శిల్పాన్ని చూడవచ్చని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. బీచ్ కు వచ్చిన పర్యాటకులు షాపింగ్ చేసేందుకు ప్రత్యేక డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. వీకెండ్స్ లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తునట్లు ఆయన చెప్పారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




