Andhra Pradesh: చేపల కోసం గాలం.. వలకు చిక్కింది చూసి పరుగులే పరుగులు..
చెరువు గట్టుపై అమర్చిన చేపల వలకి పాము చిక్కుకుపోయింది. స్థానికులు గుర్తించి ఆటవిశాఖ సిబ్బంది కి సమాచారం ఇవ్వడంతో స్థానికంగా పాములను పట్టే నేర్పరి అయిన ఓంకార్ ను రంగంలోకి దింపారు అటవీశాఖ అధికారులు. వలలో చిక్కుకుపోయిన సర్పాన్ని వలను కత్తెరించి బయటకు తీశారు.

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని అంబుసౌలీ చెరువు గట్టు పై అరుదైన గౌరీబెత్తు విషసర్పం హల్ చల్ చేసింది. చెరువు గట్టుపై అమర్చిన చేపల వలకి పాము చిక్కుకుపోయింది. స్థానికులు గుర్తించి ఆటవిశాఖ సిబ్బంది కి సమాచారం ఇవ్వడంతో స్థానికంగా పాములను పట్టే నేర్పరి అయిన ఓంకార్ ను రంగంలోకి దింపారు అటవీశాఖ అధికారులు. వలలో చిక్కుకుపోయిన సర్పాన్ని వలను కత్తెరించి బయటకు తీశారు. పాముకు ప్రథమ చికిత్స చేసి అనంతరం సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న అటవి ప్రాంతంలో విడిచి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. గ్రామం లోని దొయిసాగరం చెరువులో చేపలు బయటకు వెళ్లి పోకుండా ఉండేలా వలను ఏర్పాటు చేశారు. ఈ వలకు బ్యాండెడ్ క్రైట్ జాతికి చెందిన గౌరీబెత్తు విషసర్పం చిక్కింది. ఉదయం 10 గంటల సమ యంలో బహిర్భూమికి వెళ్లిన స్థానికుడు సంజీవికి వలలో చిక్కు కున్న పాము కనిపించింది.
దీంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాడు. కాగా ఇది చాలా అరుదైన రకం అని రాత్రి పూట చాలా చురుకుగా ఉంటుందని అటవి శాఖ సిబ్బంది తెలిపారు. కాగా బ్యాండెడ్ క్రైట్ జాతికి చెందిన ఈ పాము అత్యంత విషపూరితమైనది. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. రాత్రిపూట మాత్రమే సంచరించే ఈ జాతి పాములు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా సరిహద్దులను ఆనుకుని ఉన్న టెక్కలి, కాశీబుగ్గ, పాతపట్నం అటవీ ప్రాంతాల్లో ఈ జాతి పాములు అప్పుడప్పుడు కనిపిస్తాయి.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
