AP News: అమ్మ, నాన్న నన్ను క్షమించండి అంటూ ఫోన్ కాల్..కట్ చేస్తే..
ఓ యువతి రన్నింగ్ ట్రైన్‌లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తన తల్లిదండ్రులకు కూడా కాల్ చేసి చెప్పింది. ఇంతకి ఆ యువతి ఎందుకు చనిపోయింది? అ ఘటన ఎక్కడ జరిగింది?
రన్నింగ్ ట్రైన్‌లో నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మొదట అందరూ ప్రమాదవశాత్తు ట్రైన్ నుంచి జారిపడి చనిపోయిందనుకున్నారు. కానీ ఆ యువతి… తల్లిదండ్రులకు ఫోన్ చేసి… తాను ఎందుకు చనిపోతున్నానో చెప్పి… ట్రైన్‌లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం శివారు ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌పై ఓ యువతి డెడ్ బాడీని రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు ట్రైన్‌లో నుంచి జారిపడి యువతి చనిపోయిందని పోలీసులు అనుకున్నారు. సీన్ కట్ చేస్తే… అసలు విషయం అమ్మానాన్ననే చెప్పారు. మృతురాలు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన తనూజగా పోలీసులు గుర్తించారు. చిత్రదుర్గం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నం చేసి రాకపోవడంతో… మనస్థాపానికి గురైన తనూజ ఆత్మహత్య చేసుకుంది.
గతంలో రెండుసార్లు ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నం చేసి… మరోసారి కూడా ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో… మనస్థాపానికి గురైన తనూజ… తాను చనిపోవాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. బెంగళూరు నుంచి హోస్పేట్ వెళుతున్న తనూజ… రాయదుర్గం శివారు ప్రాంతం ట్రైన్ రాగానే… రైల్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న తనూజ మృతదేహాన్ని కనుగొన్న రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తనూజ ఆత్మహత్య చేసుకోవడానికి ముందే… తమకు ఫోన్ చేసి ఎంబీబీఎస్‌లో ఈసారి కూడా సీట్ రాలేదని చెప్పిందని.. ఇక నేను చనిపోవాలనుకుంటున్నానని తనూజ తల్లిదండ్రులు పోలీసులకు అసలు విషయం చెప్పారు. ఎంబీబీఎస్‌లో సీటు రాలేదని మనస్థాపంతో తనూజ తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి