Marriage Gift: కొడుకు పెళ్లి కానుకగా ఓ తండ్రి వినూత్న యత్నం.. సొంత ఖర్చులతో రోడ్డుకు మరమ్మత్తులు ఎక్కడంటే..
Road Gift For Marriage: ఎవరింట్లో అయినా పెళ్లంటే బంధువులను, స్నేహితులను పిలుచుకుంటారు. వచ్చే బంధువులు, శ్రేయోభిలాషుల కోసం వాహనాలను..
Road Gift For Marriage: ఎవరింట్లో అయినా పెళ్లంటే బంధువులను, స్నేహితులను పిలుచుకుంటారు. వచ్చే బంధువులు, శ్రేయోభిలాషుల కోసం వాహనాలను సమకూరుస్తారు. వసతి, విందు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. కానీ, ఇక్కడ ఓ పెళ్లి కూమారుడి తండ్రి ఇంతవరకు ఎవరూ చేయని పని చేశాడు..తన కొడుకు పెళ్లి పేరుమీద తమ గ్రామస్తులకు రహదారి కష్టాలు లేకుండా చేశారు. వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం మండలం కొత్త నరసాపురం గ్రామానికి చెందిన నిరీక్షణరావు అనే వ్యక్తి తన కొడుకు పెళ్లి సందర్బంగా గ్రామానికి రోడ్డు వేయించారు. పెళ్లికి వచ్చేవారు గతుకుల రోడ్డులో ప్రమాదానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో సుమారు రూ. 2లక్షల సొంత డబ్బుతో గ్రామానికి రోడ్డు మరమ్మతులు చేయించారు.
నరసాపురం మెయిన్ రోడ్డు నుంచి కొత్త నరసాపురం వరకు కిలోమీటరు మేర రహదారి పూర్తిగా పాడైపోయింది. గత రెండేళ్లుగా ప్రయాణించడానికి వీలు లేకుండా రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రోడ్డుమీద పెద్ద పెద్ద గోతులు పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన చిందాడి నిరీక్షణరావు తన ఖర్చులతో రోడ్డు బాగుచేయించారు. రోడ్డు మరమ్మతులు చేయించాలని అధికారులు, నాయకులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా…ఎవరూ పట్టించుకోలేదని, తన కుమారుడి పెళ్లికి గుర్తుగా ఉంటుందని ఇది తమ గ్రామానికి పెళ్లి కానుక అని నిరీక్షణ రావు చెప్పారు.
Also Read: అయ్యప్ప స్వామి పూజ ప్రాంగణంలో అద్భుత దృశ్యం.. దేవుడి చిత్రపటాల మధ్య నాగుపాము ప్రత్యక్షం..