AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఛీ..ఛీ మరీ ఇంత దారుణమా.. కూతురుని అనుభవించి గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు ఏం చెప్పిందంటే

పిల్లలకు తల్లి నవ మాసాలు మోసి జన్మనిచ్చి మమకారం చూపితే.. తండ్రి జీవిత మార్గం చూపాలి. పిల్లలకు సక్రమ మార్గం చూపి వారిని జీవితంలో ఒక స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత తండ్రిపై ఉంటుంది. పరాయి కన్ను కన్న కూతురిపై పడకుండా.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ విశాఖలో ఓ తండ్రి.. కన్న కూతురు పైనే కన్నెశాడు. తల్లి అనారోగ్యంతో మంచాన పడితే.. కన్న కూతురుని లోబర్చుకొని అనుభవించాడు.

Andhra Pradesh: ఛీ..ఛీ మరీ ఇంత దారుణమా.. కూతురుని అనుభవించి గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు ఏం చెప్పిందంటే
Rape Case
Maqdood Husain Khaja
| Edited By: Aravind B|

Updated on: Aug 22, 2023 | 9:06 AM

Share

విశాఖపట్నం, ఆగస్టు 22: పిల్లలకు తల్లి నవ మాసాలు మోసి జన్మనిచ్చి మమకారం చూపితే.. తండ్రి జీవిత మార్గం చూపాలి. పిల్లలకు సక్రమ మార్గం చూపి వారిని జీవితంలో ఒక స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత తండ్రిపై ఉంటుంది. పరాయి కన్ను కన్న కూతురిపై పడకుండా.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ విశాఖలో ఓ తండ్రి.. కన్న కూతురు పైనే కన్నెశాడు. తల్లి అనారోగ్యంతో మంచాన పడితే.. కన్న కూతురుని లోబర్చుకొని అనుభవించాడు. కూతురు గర్భం దాల్చేందుకు కారకుడు అయ్యాడు. ఎట్టకేలకు ఆ కీచక తండ్రి పాపం పండింది. సాక్షాధారాలను పరిశీలించిన విశాఖ పొక్సో ప్రత్యేక న్యాయస్థానం.. తండ్రికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.

ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖలోని మల్కాపురంలో 2020 లో అత్యాచార ఘటన జరిగింది. రామచంద్ర రావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. భార్య మంచాన పడటంతో.. కన్న కూతురైన బాలికపై కన్నేసిన తండ్రి రామచంద్రరావు.. ఆమెను లోబర్చుకొన్నాడు. అత్యాచారం చేశాడు. 15 ఏళ్ల ఆ బాలిక గర్భం దాల్చడంతో శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో విషయాన్ని గుర్తించిన బంధువు.. బాలికను ఆసుపత్రికే తీసుకెళ్లింది. దీంతో ఆ బాలిక గర్భం దాల్చిందని వైద్యులు చెప్పడంతో అంతా ఆందోళన చెందారు. బాలికను ప్రశ్నించేసరికి.. కన్నీటి పర్యంతమై తండ్రి ఆకృత్యాలు బయటపెట్టింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. క్రైమ్ నెంబర్ 371/2020 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో ఉండగా.. బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. కేసు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దిశ చట్టం ప్రకారం స్పీడు ట్రయల్ నిర్వహించెందుకు పోలీసులో అవసరమైన అన్ని ఆధారాలను కోర్టు ముందు పెట్టారు. దీంతో సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితుడికి శిక్ష ఖరారు చేసింది. నిందితుడు రామచంద్ర రావు నేరం రుజువు కావడంతో.. జీవితకాల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు. దీంతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. మరోవైపు బాధితురాలికి పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది కోర్టు.

కేసు విచారణలో పొక్సో పీపీ కరణం కృష్ణ గట్టిగా వాదనలు వినిపించారు. బాధితులకు నాయ్యం జరిగే లాగా దిశ చట్టం స్పీడ్ ట్రయల్‎కి ఉపయోగపడిందని అంటున్నారు. మరోవైపు నిందితుడికి కన్విక్షన్ పడటంలో ప్రతిభ కనబరిచిన స్పెషల్ పోక్సో పీ.పీ కరణం కృష్ణ, కేసు ట్రయల్ జరడంలో పురోగతి చూపించిన నగర పోలీసు అధికారులను, కోర్టు కానిస్టేబుల్ ఆర్. పైడితల్లిని నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.