Somu Veerraju: సోము వీర్రాజు అల్లుడిపై కేసు నమోదు.. ఫోర్జరీ సంతకాలతో లోను తీసుకున్నట్లుగా ఆరోపణ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు నరసింహం బ్యాంకు ఫ్రాడ్ పై రచ్చ రచ్చ నడుస్తోంది. సుమారు 15 కోట్ల రూపాయల మేర ఫోర్జరీ సంతకాల వ్యవహారం వెలుగు చూసింది. ఫోర్జరీ సంతకాలతో..
Bank Forgery Case: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు నరసింహం బ్యాంకు ఫ్రాడ్ పై రచ్చ రచ్చ నడుస్తోంది. సుమారు 15 కోట్ల రూపాయల మేర ఫోర్జరీ సంతకాల వ్యవహారం వెలుగు చూసింది. ఫోర్జరీ సంతకాలతో నరసింహం, భూ యజమానులను ముంచినట్టు ప్రధాన ఆరోపణ. రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ, శ్రీవాణి దంపతులు. వీరి ఆస్తులను ఫోర్జరీ సంతకాలతో బ్యాంకులో పెట్టి నరసింహం లోను తీసుకున్నట్టు కంప్లయింట్. 2018- 19, 20 ల మధ్య కాలంలో కొందరు బ్యాంకు సిబ్బంది సహకారంతో నరసింహం ఈ ఫ్రాడ్ చేసినట్టుగా చెబుతున్నారు బాధితులు.
లోన్లు మంజూరైన సమయంలో భూ యజమానులమైన తాము ఢిల్లీలో ఉండటం వల్ల తెలియలేదని చెబుతున్నారు. లోన్ తిరిగి చెల్లించమంటూ బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో బాధిత కుటుంబం.. కొవ్వూరు పోలీసులు ఆశ్రయించారు. నరసింహంపై ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు పోలీసులు.
ఇవి కూడా చదవండి: Schools Shut: జనవరి 31 వరకు స్కూల్స్ క్లోజ్.. కీలక నిర్ణయం తీసుకున్న మహా సర్కార్..