Nandyal: స్కూల్లో అధికారుల ఆకస్మిక దాడులు.. ఓ బాక్స్‌లో కనిపించినవి చూసి బిత్తరపోయారు

వన్యప్రాణుల్లో తాబేలుకు జీవితకాలం చాలా ఎక్కువ. దీన్ని ఇంట్లో పెంచుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న విశ్వాసం ఉత్తరాది వాళ్లలో ఎక్కువగా ఉంటుంది. అలానే ఇవి ఇంట్లో ఉంటే సరిసంపదలు కలుగుతాయని, బాగా కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు అందుకే వీటికి బయట డిమాండ్ ఎక్కువ.

Nandyal: స్కూల్లో అధికారుల ఆకస్మిక దాడులు.. ఓ బాక్స్‌లో కనిపించినవి చూసి బిత్తరపోయారు
Star Tortoise
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 20, 2023 | 9:21 AM

నంద్యాల జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది.  గెలివి స్కూల్‌లో ఏడు నక్షత్ర తాబేలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కాగా  సమాచారం అందడంతో.. ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఫారెస్ట్ అధికారులు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వాటితో బిజినెస్ చేసేందుకు కాకుండా.. అవి స్కూల్లో ఉంటే మంచి జరుగుతుందన్న సెంటిమెంట్‌తో వాటిని అక్కడికి తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్ళను సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలేశారు. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి.. తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. నక్షత్ర తాబేళ్లు చాలా అరుదుగా కనిపిస్తాయని అధికారులు తెలిపారు.

ఈ నక్షత్ర తాబేళ్లను స్మగ్లింగ్ చేయడానికి ప్రధాన కారణం మూఢనమ్మకమే. ఇవి ఇంట్లో ఉంటే కలిసి వస్తుందని.. సిరులు పంట పండుతుందని ప్రచారం జరుగుతూ ఉంటుంది. దీంతో స్మగ్లర్లు ఈ అరుదైన జీవులను వేటాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.  పోలీసులు, అటవీశాఖ అధికారులు పలుసార్లు.. ఈ ముఠాలు తిక్క కుదిర్చి జైల్లో వేసినప్పటికీ.. కొందరు అదే దందాను కంటిన్యూ చేస్తున్నారు. ఇవి ఎక్కువగా ఆకురాల్చే అడవుల్లో కనిపిస్తాయి. అంతరించి పోతున్న వన్యప్రాణుల జాబితాలో నక్షత్ర తాబేలు కూడా ఉంది.

ఏపీ నుంచి ఉత్తరాధి రాష్ట్రాలకు ఎక్కువగా వీటిని అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. స్మగ్లర్లు ఒక్కో తాబేలును మార్కెట్‌లో రూ.50వేల వరకు విక్రయిస్తారని తెలిసింది. ఈ తాబేళ్లు ఆలయాలు, అడవుల్లో మాత్రమే ఉండాలి. బయట ఎవరి వద్ద ఉన్నా చట్టాన్ని అతిక్రమించడమే. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అటవీ శాఖ అదికారులు వార్నింగ్ ఇస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..