Andhra Pradesh: అమ్మాయి చున్నీపై.. అబ్బాయి చేతిపై.. ఇలా అయితే ఎలా

బుధవారం నిర్వహించిన ప్రథమ, తృతీయ సెమిస్టర్‌ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన ఆరుగురు విద్యార్థులు డిబార్‌ అయినట్లు పరీక్షల నిర్వహణ విభాగాధిపతి ప్రొఫెసర్‌ జీవీ రమణ తెలిపారు.

Andhra Pradesh: అమ్మాయి చున్నీపై.. అబ్బాయి చేతిపై.. ఇలా అయితే ఎలా
Mass Copying
Follow us

|

Updated on: Mar 16, 2023 | 9:38 AM

చదువులో ప్రతిభ చూపించాల్సిన స్టూడెంట్స్… కాపీ కొట్టడంలో తమ రేంజ్ చూపించి అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. విభిన్న మార్గాల్లో కాపీయింగ్‌కు తెరలేపారు విద్యార్థులు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం పొలిటికల్‌ సైన్స్ సైకాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు పేపర్‌-1, బీకామ్‌, బీబీఏ, బీసీఏ విద్యార్థులకు పేపర్‌-2 ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ పరీక్షలకు ఓ విద్యార్థిని డ్రస్ చున్నీపైనే ఆన్సర్స్ రాసుకోని వచ్చింది. కొందరు బాయ్స్.. చేతులతో సమాధానాలు రాసుకుని ఎగ్జామ్ సెంటర్లకు వచ్చారు. వాటిని చూసిరాసే సమయంలో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. ఇలా కాపీయింగ్ చేసేందుకు ప్రయత్నించగా..  అనంతపురంలో ఐదుగురు, తాడిపత్రిలో ఒకరిని అధికారులు డిబార్ చేశారు.

డిగ్రీ విద్యాబోధనలో ప్రమాణాలు తగ్గిపోవడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్‌ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యపకులను నియమించకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ఇంగ్లీష్ రాని, అరకొర నాలెడ్జ్ ఉన్నవారు అయితే తక్కవ జీతాలకు వస్తున్నారని.. వారిని హైర్ చేసుకుంటున్నారు. దీంతో స్టూడెంట్స్‌కు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడం లేదు. ఈ క్రమంలోనే ఫెయిల్ అవ్వకుండా గట్టెక్కేందుకు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..