CM Jagan: ఏపీ స్టూడెంట్స్‌కు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఈ నెల 19న ఖాతాల్లోకి నేరుగా డబ్బులు

వాస్తవానికి ఈ నెల 18న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. 19కి వాయిదా పడింది. తిరువూరులో ఈ ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు సీఎం జగన్.

CM Jagan: ఏపీ స్టూడెంట్స్‌కు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఈ నెల 19న ఖాతాల్లోకి నేరుగా డబ్బులు
Andhra CM Jagan Reddy
Follow us

|

Updated on: Mar 16, 2023 | 10:16 AM

ఏపీ సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యా దీవెన పథకం నిధులు మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం డబ్బుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు సీఎం జగన్. వాస్తవానికి ఈ నెల 18న జరగాల్సి ఉండగా.. 19కి వాయిదా పడింది. ఇందుకోసం తిరువూరులో సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌ ఎగ్జామ్ సెంటర్ పక్కనే.. అయ్యప్ప టెంపుల్ దగ్గర ఖాళీ స్థలం ఉంది.. దానిని ముఖ్యమంత్రి మీటింగ్ సభ కోసం అధికారులు ఎంపిక చేశారు. అయితే స్టూడెంట్స్ 18న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాల్సి ఉంది. అదేరోజు మీటింగ్ పెడితే విద్యార్థులు ఇబ్బంది పడతారని అధికారులు భావించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం కార్యక్రమాన్ని 19వ తేదీ (ఆదివారం) కి పోస్ట్ పోన్ చేసింది. జగనన్న విద్యా దీవెన స్కీమ్ కింద అర్హులైన పేద విద్యార్థులందరికీ సర్కార్ పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందజేస్తున్న సంగతి తెలిసిందే.

స్టూడెంట్స్ కళాశాలలకు కట్టాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని.. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే స్టూడెంట్స్ తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం. అంతేకాదు పూర్ స్టూడెంట్స్ భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా చేస్తోంది జగన్ సర్కార్. జగనన్న వసతి దీవెన స్కీమ్ కింద ఏటా 2 వాయిదాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్‌, డిగ్రీ ఇతర కోర్సులు చేసేవారికి  రూ.20 వేలు అందజేస్తోంది. అలాగే ఐటీఐ స్టూడెంట్స్‌కు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ స్టూడెంట్స్‌కు రూ.15 వేలు ఇస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా