AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather: తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు…

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Weather: తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు...
Weather Report
Ram Naramaneni
|

Updated on: Jul 22, 2024 | 9:16 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో వర్షం కాస్త తగ్గింది.. కానీ వరద ముంపు ఇంకా అలాగే ఉంది. గోదావరి మహోగ్రంగానే ఉరకలేస్తోంది. ఇప్పటికే వందల TMCల నీరు వృధాగా సముద్రం పాలయ్యింది. అటు కృష్ణా ప్రాజెక్టులకు నెమ్మదిగా జలకళ వస్తోంది.

ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావం, ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో మరో మూడ్రోజులు వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ అధికారులు. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని తెలిపారు. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అటు రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని సూచిస్తున్నారు వాతావరణ అధికారులు.

తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ చెప్పింది. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ అధికారులు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంది. సిటీలో మళ్లీ ముసురు కొనసాగుతోంది. పలుచోట్ల మోస్తరు వర్షం పడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి