Video: ఏపీలో టీమిండియా తొలి టెస్ట్ కెప్టెన్ విగ్రహం.. ఎక్కడుందో తెలుసా?
CK Naidu: దేశంలో టీమిండియా తొలి కెప్టెన్ సీకే నాయుడు విగ్రహాలు మూడు ఉన్నాయి. ఇవన్నీ దేశంలోని వివిధ స్టేడియంలలో ఏర్పాటు చేశారు. మొదటి విగ్రహం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో ఉండగా, రెండవ విగ్రహం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఉంది. అలాగే మూడో విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉందని మీకు తెలుసా?.
ఏలూరు: తెలుగు వారు అభిమానిస్తే ప్రాణాలు ఇస్తారు. ఇది సినిమాలో డైలాగ్ మాత్రం కాదని కొన్ని సంఘటనలు తెలిసినపుడు మనకు అర్దమౌతుంది. గ్రామాల్లో, పట్టణాల్లో పూర్వం స్వతంత్ర సమరయోధులు, జాతీయ నాయుకులు, సంఘ సంస్కర్తల విగ్రహాలు ఎక్కువగా కనిపించేవి. ఆ తర్వత ఇపుడు విగ్రహాలు ఏర్పాటు చేయటమే ఒక పెద్ద వివాదంగా మారుతున్నా పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ భావానికి క్రీడలు స్పూర్తి దాయకంగా నిలుస్తాయని చెబుతుంటారు. అలాంటి స్ఫూర్తి ఒక క్రికెటర్ పట్ల పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఉంచుకున్నారు. ప్రాంతం , భాష వంటి ఎలాంటి బేధ భావం లేకుండా అ క్రికెటర్ విగ్రహాన్ని తమ గ్రామంలో కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటు చేయటం అందరికి ఆడర్శగా నిలిచింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగవరం మండలం కత్తవపాడులో భారత తొలి టెస్ట్ క్రికెట్ కెప్టెన్ కొట్టారి కనకయ్య నాయుడు విగ్రహం ఏర్పాటైంది. కనకయ్య నాయుడిని సి.కె. నాయుడు అని పిలుస్తారు. కొట్టారి కనకయ్య నాయుడు 1895 అక్టోబరు 31న నాగపూర్లోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. సుమారు 72 సంవత్సరాల వయస్సులో అంటే 1967లో మరణిచారు. ఈయన స్కూల్ డేస్ నుంచి క్రికెట్ పట్ల మక్కువ పెంచుకుని, ఆ తర్వాత జాతీయ జట్టు తరపున రికార్డుల మోత మోగించారు. భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్‌గా సి.కె నాయుడు 1916లో మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడారు. ఆయనకు 68 ఏళ్ళ వయసు వచ్చే వరకు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. క్రికెట్ చరిత్రలో 48 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్న మరో ప్లేయర్ లేరని చెబుతుంటారు. ఫస్ట్ క్లాసు క్రికెట్లో యాభై ఏళ్ళ వయసు దాటాక కూడా డబుల్ సెంచరీ చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్ళలో సి.కె. ఒకరు. 1955లో భారత ప్రభుత్వం నుంచి సి కె పద్మభూషణ్ సైతం అందుకున్నారు.
విగ్రహం ఎవరు పెట్టారంటే ..
పశ్చిమగోదావరి జిల్లా కత్తవపాడు గ్రామానికి చెందిన మామిడి రాజామహవీర్ కి చిన్నతనం నుంచి క్రికెట్‌పై అమితమైన ఆసక్తి ఉంది. గ్రామంలో పెద్దలతో కలిసి కొన్ని సంవత్సరాలు భారీ ఎత్తున క్రికెట్ టోర్నమెంట్‌లు సైతం నిర్వహించేవారు. వివిఎస్ లక్ష్మణ్ వంటి వారితో సన్నిహితం గా ఉండేవారని గ్రామస్తులు చెబుతున్నారు. క్రికెట్‌పై ఆసక్తి ఉండటంతో భారత తొలి టెస్ట్ క్రికెట్ కెప్టెన్ కొఠారి కనకయ్య నాయుడు విగ్రహాన్ని తన సొంత గ్రామమైన కత్తెవపాడులో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. ఈయన గత కొంతకాలంగా అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం కత్తవపాడు గ్రామానికి మామిడి రాజామహవీర్ తల్లి మామిడి ఫనేంద్ర వరప్రసాద్ లక్ష్మి సర్పంచ్ గా కొనసాగుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..