Addanki: నేతన్న వండర్.. 16 కేజీల పట్టువస్త్రంపై రామాయణంలోని 168 చిత్రాలు
నేతన్న అద్భుతం చేశాడు. తన కళను భక్తి రూపంలో ప్రదర్శించాడు. 16 కేజీల పట్టువస్త్రంపై రామాయణంలోని 168 చిత్రాలు రూపొందించాడు. ఆ భారీ వస్త్రాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. వివరాలు...

బాపట్ల జిల్లా అద్దంకిలో నేతన్న నాగరాజు వండర్ క్రియేట్ చేశాడు. 16 కేజీల పట్టువస్త్రంపై రామాయణంలోని 168 చిత్రాలను రూపొందించాడు. ఆ భారీ చీరలాంటి వస్త్రాన్ని చూసి స్థానికులంతా ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. నాగరాజు ఓపిక, శ్రమ అద్భుతమంటూ కొనియాడారు.
సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నాగరాజు.. అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న భవ్య రామ మందిరంలో కొలువు తీరనున్న సీతారామచంద్రుల సన్నిధి కోసం ప్రత్యేకంగా చీరను నేశారు. పట్టు వస్త్రాన్ని అద్దంకిలోని హరిహర గోకులం వేల్ఫేర్ సొసైటీ గోశాలలో వస్త్ర ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. 160 అడుగుల పట్టు వస్త్రాన్ని చూసేందుకు స్థానికులు పోటీపడ్డారు. సాయంత్రం వేళ విద్యుత్ కాంతుల మధ్య పట్టు వస్త్రం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
