ఎన్టీఆర్ శతజయంతికి వంద రూపాయ కాయిన్ విడుదల..వెల్లడించిన కేంద్రం
దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది.

దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. వంద రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై తాజాగా అధికారిక గెజిట్ జారీ చేసింది. 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది. అంతేకాదు ఐదు శాతం నికెల్, ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం..మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ,భాషలలో 1923-2023 అరి ముద్రిస్తారు. అయితే ఈ విషయాన్ని గెజిట్లో స్పష్టంగా కేంద్రం ప్రభుత్వం వివరించింది. ఈ విషయం తెలియడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..