AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: తల్లి నిద్రిస్తుండగా పసికందును ఎత్తుకెళ్లిన మహిళ.. అసలు ఏం జరిగిందంటే

పది రోజుల పసికందును తల్లి నుంచి దూరం చేసింది.. స్నేహితురాలిగా ఇంటికి వచ్చి ఆమెతోనే ఉండి డెలివరీ సమయంలో సహాయం చేసి.. పది రోజుల తర్వాత తల్లి నిద్రిస్తున్న సమయంలో బిడ్డతో ఉడాయించింది ఓ ప్రబుద్ధురాలు.. తీరా నిద్రలేచి చూసే సమయానికి బిడ్డ లేకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో చోటుచేసుకుంది.

Andhra: తల్లి నిద్రిస్తుండగా పసికందును ఎత్తుకెళ్లిన మహిళ.. అసలు ఏం జరిగిందంటే
Woman Kidnaps Friend's Infant
Sudhir Chappidi
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 28, 2025 | 4:07 PM

Share

కడప జిల్లా పులివెందులలో పది రోజుల పసికందును ఎత్తుకెళ్లింది కుమారి అనే మహిళ.. తల్లి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పది రోజుల బిడ్డతో పారిపోయింది.. వివరాలలోకి వెళితే పులివెందులకు చెందిన గర్భిణీ స్త్రీగా ఉన్న కుళ్లాయమ్మ తన స్నేహితురాలు కుమారిని తనకు సహాయం చేయవలసిందిగా అడిగింది. దీంతో ఈనెల 16వ తేదీన కుమారి అనే మహిళ కుళ్లాయమ్మ ఇంటికి వచ్చింది. ఆ తరువాత కుళ్లాయమ్మ ఈనెల 18వ తేదీన కడప రిమ్స్ ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత వీరు కడప నుంచి పులివెందుల కు వెళ్లి వారి ఇంట్లో ఉంటున్నారు. స

రిగ్గా నిన్న మధ్యాహ్నం సమయంలో కుళ్లాయమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమె స్నేహితురాలు కుమారి కుళ్లాయమ్మకు జన్మించిన పది రోజుల మగసిశువును తీసుకొని పులివెందులలో ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. నిద్రలేచి చూసే సమయానికి తన కొడుకు లేకపోవడంతో తన భర్తకు, బంధువులకు చెప్పింది. దీంతో వారు పులివెందుల పరిసర ప్రాంతాలలో కుమారి కోసం వెతికారు.

అయితే కుమారి జాడ తెలియకపోవడంతో ఈరోజు ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పులివెందుల డిఎస్పి మురళి నాయక్ స్పందించారు. నలుగురు సీఐలను, ఐదుగురు ఎస్ఐలతో పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

వీడియో చూడండి..

గర్భిణీగా ఉన్న తనకు సాయం చేయాలని కుమారిని కోరానని అయితే ఇలా చేస్తుందని అనుకోలేదని బాధితురాలు తెలిపింది. అయితే కుమారిని పులివెందుల పోలీసులు తాడిపత్రిలో గుర్తించినట్లు తెలుస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..