AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా కెమెరాకు చిక్కిన చైనా స్పేస్ విమానం.. అసలేం జరుగుతోంది?

అంతరిక్ష ప్రయోగాలను రహస్యంగా చేసే చైనా ఇప్పటివరకు షెన్‌లాంగ్‌ ఫొటోను విడుదల చేయలేదు. తాజాగా అమెరికా పరిశోధకులకు చిక్కిన ఫొటోలో ఈ విమానం 26 అడుగుల పొడవు ఉందని తెలిసింది. షెన్ లాంగ్ ఈ వారం అమెరికాలోని ప్రధాన నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. నవంబరు 3న డెన్వర్, నవంబరు 5, 6 తేదీల్లో లాస్ ఏంజిల్స్ లో ప్రజలు ఉదయం ఆకాశంలో దీనిని స్పష్టంగా చూడవచ్చు.

అమెరికా కెమెరాకు చిక్కిన చైనా స్పేస్ విమానం.. అసలేం జరుగుతోంది?
Chinese Plane Released Mysterious Objects In Us Space Caught On Camera
Sharada V
|

Updated on: Nov 03, 2026 | 10:28 AM

Share

అంతరిక్ష ప్రయోగాలను రహస్యంగా చేసే చైనా ఇప్పటివరకు షెన్‌లాంగ్‌ ఫొటోను విడుదల చేయలేదు. తాజాగా అమెరికా పరిశోధకులకు చిక్కిన ఫొటోలో ఈ విమానం 26 అడుగుల పొడవు ఉందని తెలిసింది. షెన్ లాంగ్ ఈ వారం అమెరికాలోని ప్రధాన నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. నవంబరు 3న డెన్వర్, నవంబరు 5, 6 తేదీల్లో లాస్ ఏంజిల్స్ లో ప్రజలు ఉదయం ఆకాశంలో దీనిని స్పష్టంగా చూడవచ్చు.

అమెరికా భూకక్ష్యపై పరికరాలను జార విడిచి..

అంతరిక్ష పరిశోధనల్లో చైనా, అమెరికా నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఆరేళ్ల కిందట చైనా ఓ రహస్య విమానాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇది అమెరికా భూకక్ష్యపై పరికరాలను జార విడిచింది.  దీనిని అప్పట్నుంచి పరిశీలించిన అమెరికా నిఘా వర్గాలు తాజాగా చైనా రహస్య విమానం హై రిజల్యూషన్‌ ఫోటోను విడుదల చేసారు.

రోబోటిక్ టెక్నాలజీతో పనిచేసే స్పేస్ ప్లేన్‌ పేరు ‘ షెన్‌లాంగ్ ‘ (Shenlong). చైనా భాషలో ‘దివ్యమైన డ్రాగన్’ (Divine Dragon) అనే అర్థం వస్తుంది. గత ఆరేళ్లుగా అంతరిక్షంలో రహస్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అమెరికా పై భూమి దిగువ కక్ష్యలోకి కొన్ని గుర్తుతెలియని వస్తువులను జారవిడిచింది. అవి ఏంటని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. భూకేంద్ర రాడార్ల సహాయంతో తాజాగా ఈ స్పేస్ ప్లేన్ ను గమనించారు.

‘మాక్సార్ టెక్నాలజీస్’ కి చెందిన ఉపగ్రహం 90 కిలోమీటర్ల దూరం నుంచి దీనిని ఫొటో తీసింది. పిక్సెల్‌కు 4.5 సెంటీమీటర్ల రిజల్యూషన్ తో ఫొటో రావడంతో దాని టెక్నాలజీ సామర్థ్యాలను అధ్యయనం చేస్తున్నారు. అంతరిక్షంలోకి ప్రవేశించి వివిధ పరికరాలను భూ కక్ష్యలోకి చేర్చి పరిశోధనలు జరిపి చైనాకు అందిస్తుంది షెన్‌లాంగ్. ఫొటోలో షెన్‌లాంగ్ మరొక ఉపగ్రహంతో అనుసంధానమైంది. సోలార్ ప్యానెళ్లను తెరుచుకుని కనిపించింది. వెనుక భాగంలో పేలోడ్ తలుపు కూడా తెరిచి ఉంది.

మళ్లీ వాడటానికి అనువుగా ఉండే ఈ అంతరిక్ష విమానం, అమెరికాకు చెందిన ‘బోయింగ్ X-37B’ స్పేస్ ప్లేన్‌ ను  పోలిన డిజైన్ తో చైనా తయారుచేసింది. ఇది రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది. తిరిగి సాధారణ విమానంలాగా రన్‌వేపై ల్యాండ్ అవుతుంది. ప్రస్తుతం షెన్‌లాంగ్ తన నాల్గవ అంతరిక్ష యాత్రలో ఉన్నట్లు తెలిసింది. చైనాలోని శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ‘లాంగ్ మార్చ్ 2F’ రాకెట్ ద్వారా  ఆరేళ్ల క్రితం దీనిని అంతరిక్షంలోకి పంపారు.

Follow Us