Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు: చంద్రబాబు ట్వీట్
Andhra Pradesh: విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా, ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అత్యధికంగా 135 స్థానాల్లో విజయం సాధించగా, జనసేన పోటీ చేసిన..

ఏపీ కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాదైన సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ ట్వీట్ చేశారు. జూన్ 4న ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని, జూన్ 4 ప్రజాతీర్పుతో ఉన్మాద పాలనపోయిన రోజు అని అన్నారు. జూన్ 4 ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు అని వ్యాఖ్యానించారు. ఏపీ దశదిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు నమస్కారాలంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
రాజీలేని పోరాటంతో కూటమి విజయం:
విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏడాదిగా పనిచేస్తున్నామని అన్నారు. పాలనను గాడినపెట్టి.. సంక్షేమాన్ని అందిస్తూ.. అభివృద్ధిని పట్టాలెక్కించామని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు సీఎం చంద్రబాబు.
ఇదిలా ఉండగా, ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అత్యధికంగా 135 స్థానాల్లో విజయం సాధించగా, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో అన్నింటిలోనూ గెలిచి 100% విజయశాతం సాధించింది. బీజేపీ కూడా 8 స్థానాల్లో విజయం సాధించగా, ఇది రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మైలురాయిగా నిలిచింది. జనసేన సాధించిన విజయం ప్రత్యేకంగా చర్చకు తెరతీసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
