AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తైవాన్ కి అమెరికా బృందం, కస్సుమన్న చైనా

తైవాన్ కి ఉన్నత స్థాయి అధికార బృందాన్ని పంపాలన్న అమెరికా యోచన పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ బృందం అక్కడికి వెళ్తే తైవాన్ శాంతికి, సుస్థిరతకు భంగం వాటిల్లుతుందని ఆక్రోశించింది.

తైవాన్ కి అమెరికా బృందం, కస్సుమన్న చైనా
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 06, 2020 | 1:44 PM

Share

తైవాన్ కి ఉన్నత స్థాయి అధికార బృందాన్ని పంపాలన్న అమెరికా యోచన పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ బృందం అక్కడికి వెళ్తే తైవాన్ శాంతికి, సుస్థిరతకు భంగం వాటిల్లుతుందని ఆక్రోశించింది. 1979 నుంచే అమెరికా.. తైవాన్ కి దౌత్యపరమైన గుర్తింపునిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో యుఎస్ హెల్త్ చీఫ్ అలెక్స్ అజర్ ఆధ్వర్యాన ఓ ప్రతినిధి బృందాన్ని అక్కడికి పంపాలని అమెరికా యోచిస్తోంది. ఈ చిన్న దేశానికి అమెరికా ఆయుధాలను సప్లయ్ చేస్తున్నప్పటికీ.. అధికారికంగా దానితో కాంటాక్ట్ పెట్టుకోలేదు. అయితే ఆరేళ్ళ తరువాత తైవాన్ తో మళ్ళీ సంబంధాలు కొనసాగించాలన్న ఉద్దేశంతో.. యుఎస్ వీళ్ళను పంపే ప్రయత్నంలో ఉంది. కానీ..చైనా మాత్రం ఇందుకు వ్యతిరేకతను తెలియజేస్తూ.. తైవాన్ మీద మాకే హక్కు ఉందని, అది ఏనాటికైనా మాదేనని అడ్డంగా వాదిస్తోంది. ఇప్పటికే హాంకాంగ్ పై పెత్తనం చెలాయించడానికి బీజింగ్ చేస్తున్న యత్నాలతో చిరాకెత్తిన అమెరికా.. మా వాళ్ళను తైవాన్ కి పంపితీరుతామని పట్టు బట్టింది. మా అధికారులు అక్కడికి వెళ్తారని ప్రకటించింది.

దీంతో అమెరికా-చైనా మధ్య మళ్ళీ దౌత్య సంబంధాలు మరింత దిగజారనున్నాయి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర