అరిజోనా జైల్లో 500 మందికి పైగా ఖైదీలకు కరోనా పాజిటివ్..!
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అరిజోనా రాష్ట్రంలోని ఓ జైలులో ఏకంగా 500 మందికి పైగా ఖైదీలకు కరోనా సోకినట్లు
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అరిజోనా రాష్ట్రంలోని ఓ జైలులో ఏకంగా 500 మందికి పైగా ఖైదీలకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఎఎస్‌పీసీ-టక్సన్ వీట్‌స్టోన్ జైలులో 517 మందికి కరోనా పాజిటివ్‌గా వచ్చిందని అరిజోనా డిపార్టుమెంట్ ఆఫ్ ది కరెక్షన్స్, రిహాబిలిటేషన్ అండ్ రీఎంట్రీ(ఏడీసీఆర్ఆర్) తెలిపింది. దీంతో బాధితులను ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.
టక్సన్ లోని వీట్‌స్టోన్ జైలులో ప్రస్తుతం 1,066 మంది ఖైదీలు ఉన్నారు. బాధితులు పూర్తిగా కోలుకునేంత వరకు మిగతా ఖైదీలతో కలిసేందుకు అనుమతి ఇవ్వబోమని అధికారులు తెలియజేశారు. ఇక యూఎస్‌లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో అరిజోనా కూడా ఒకటి. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో 1,82,203 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 3,932 మందిని ఈ మహమ్మారి బలిగొంది.
Read More:
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!
దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!