తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!

టిఎస్ ఐపాస్ లాగానే టిఎస్ బిపాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది. భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టిఎస్ బి పాస్ పాలసీని సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదించింది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2020 | 12:12 PM

టిఎస్ ఐపాస్ లాగానే టిఎస్ బిపాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది. భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టిఎస్ బి పాస్ పాలసీని సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదించింది. ఈ విధానం ప్రకారం 21 రోజుల్లోనే భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలి. లేదంటే 22వ రోజున ఆటోమెటిక్‌గా ఆన్‌లైన్‌లో పర్మిషన్‌ వచ్చేస్తుంది. జీహెచ్‌ఎంసీ మినహా అన్ని మున్సిపాలిటీలు ‘తెలంగాణ మున్సిపల్‌ యాక్ట్‌-2019’ పరిధిలోకి వస్తాయని తెలిసిందే. అయితే భవన నిర్మాణ అనుమతుల విషయంలో జీహెచ్‌ఎంసీ సహా అన్ని పురపాలక సంఘాలకు వర్తించేలా ఒక పాలసీ ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతుంది. మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ (http://tsbpass.telangana.gov.in/html/te/index.html) లేదా మీసేవ, పౌర సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అనుమతుల్లో పారదర్శకత నెలకొల్పడం, నిర్దిష్ఠ సమయం విధించడం, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు, నిర్మాణదారుకు మధ్య వ్యక్తిగత ప్రమేయం తగ్గుతుంది.