AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజస్తాన్ సంక్షోభంలో సీఎం అశోక్ గెహ్లాట్ కి కాస్త ఊరట

రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో సీఎం అశోక్ గెహ్లాట్ కి కాస్త ఊరట లభించింది. తమ పార్టీకి చెందిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలీనం  కావడాన్ని ప్రశ్నిస్తూ..

రాజస్తాన్ సంక్షోభంలో సీఎం అశోక్ గెహ్లాట్ కి కాస్త ఊరట
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 06, 2020 | 4:22 PM

Share

రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో సీఎం అశోక్ గెహ్లాట్ కి కాస్త ఊరట లభించింది. తమ పార్టీకి చెందిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలీనం  కావడాన్ని ప్రశ్నిస్తూ..బహుజన్ సమాజ్ పార్టీ దాఖలు చేసిన అప్పీలును రాజస్తాన్ హైకోర్టు కొట్టివేసింది. అయితే దీనిపై సింగిల్ బెంచ్ విచారిస్తుందని ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 11 ఈ అప్పీలుపై సింగిల్ బెంచ్ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు.  ఆ నిర్ణయం గెహ్లాట్ ప్రభుత్వ మనుగడపై ప్రభావం చూపవచ్చునని భావిస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు బీఎస్పీలోనే కొనసాగుతారని ఆ బెంచ్ ప్రకటిస్తే.. అసెంబ్లీలో గెహ్లాట్ బల పరీక్షను ఎదుర్కొనేటప్పుడు ఇబ్బందులు తప్పవు. ఈ ఆరుగురితో కలిపి తనకు మొత్తం 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గెహ్లాట్ చెప్పుకొంటున్నారు. కానీ కోర్టు నిర్ణయం మరొకలా ఉన్న పక్షంలో..ఆయన సంఖ్యా బలం 102 నుంచి 96 కి తగ్గుతుంది.

సభలో బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసమ్మతినేత సచిన్ పైలట్ నేతృత్వంలోని 18 మంది రెబెల్ సభ్యులు, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలిపితే.. మొత్తం సంఖ్య 97 అవుతుంది. సభలో జరిగే ప్రొసీడింగ్స్ లో ఈ ఆరుగురు బీఎస్పీ మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనకుండా తాత్కాలిక స్టే జారీ చేయాలని బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీలు కోర్టును కోరాయి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర