ట్రంప్ వీడియోను తొలగించిన ఫేస్ బుక్, ట్విటర్, ఎందుకంటే ?

కరోనా వైరస్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోను ఫేస్ బుక్, ట్విటర్ తొలగించాయి. ఆయన తప్పుడు సమాచారమిచ్చినందుకు తామీ చర్య తీసుకున్నట్టు పేర్కొన్నాయి. కోవిడ్-19 సోకకుండా పిల్లల్లో చాలావరకు నిరోధక శక్తి ఉంటుందని ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.....

ట్రంప్ వీడియోను తొలగించిన ఫేస్ బుక్, ట్విటర్, ఎందుకంటే ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 06, 2020 | 10:27 AM

కరోనా వైరస్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోను ఫేస్ బుక్, ట్విటర్ తొలగించాయి. ఆయన తప్పుడు సమాచారమిచ్చినందుకు తామీ చర్య తీసుకున్నట్టు పేర్కొన్నాయి. కోవిడ్-19 సోకకుండా పిల్లల్లో చాలావరకు నిరోధక శక్తి ఉంటుందని ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. దాని తాలూకు వీడియోను పోస్ట్ చేశారు. కానీ ఈ వీడియోను అలాగే ఉంచితే అది తమ నిబంధనలను అతిక్రమించినట్టే అవుతుందని ఫేస్ బుక్, ట్విటర్ వివరించాయి. అమెరికాలో స్కూళ్లను తెరవాలని, వారిలో ఇమ్యూనిటీ (రోగనిరోధక శక్తి) ఎక్కువగా ఉంటుంది గనుకే కోవిడ్ వైరస్ వారికి సోకదని ట్రంప్ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కానీ ఇది తప్పని ఈ రెండు సామాజిక మాధ్యమాలూ అభిప్రాయపడ్డాయి.

అమెరికా అధ్యక్షపదవికి ఎన్నికలు జరగడానికి ఇక మూడు నెలల సమయం మాత్రమే ఉంది. అలాంటి తరుణంలో దేశాధ్యక్షుని పోస్టును ఇవి డిలీట్ చేయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న సమయంలో ఈ విధమైన వ్యాఖ్యలు సహేతుకం కాదని ఇవి పేర్కొంటున్నాయి. నిజానికి పిల్లల్లో కూడా స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉంటాయని. వాటిని వారు పెద్దలకు, స్కూళ్లలో టీచర్లకు సోకింపజేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో సుమారు రెండు లక్షల నలభై వేల మంది పిల్లలకు కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా సోకినట్టు రీసెర్చర్లు చెబుతున్నారు.