Bird Flu: అమెరికాలో మొదటిసారిగా మనిషికి బర్ద్ ఫ్లూ.. కోళ్ల నుంచి సంక్రమించిందని అనుమానం.. పరిశీలనలో 2,500 మంది
Bird Flu: ఓ వైపు కరోనా వైరస్(Corona Virus) .. ఇంకా రకరకాల రూపాలను సంతరించుకుని మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. మరోవైపు మానవులలో బర్ద్ ఫ్లూ కేసులు వెలుగులోకి..
Bird Flu: ఓ వైపు కరోనా వైరస్(Corona Virus) .. ఇంకా రకరకాల రూపాలను సంతరించుకుని మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. మరోవైపు మానవులలో బర్ద్ ఫ్లూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం చైనాలో(China) మొదటిసారిగా మానవులకు బర్ద్ ఫ్లూ సోకినట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో(America) మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు మనుషుల్లో నమోదైంది. కొలరాడోకు చెందిన వ్యక్తిలో ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా ఏ(హెచ్5) వైరస్ పాజిటివ్ గా నిర్ధారించినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విభాగం ప్రకటించింది. హెచ్5 వైరస్ మనుషుల్లో కనిపించడం అరుదు.
కొలరాడో వ్యక్తి చెందిన ఈ వ్యక్తి ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ బారిన పడ్డారు. బాధితుడు H5N1 బర్డ్ ఫ్లూ సోకిందని అనుమానంలో ఒక పౌల్ట్రీ ఫామ్ లోని కోళ్లను చంపే కార్యక్రమంలో పాల్గొన్నాడని Xinhua వార్తా సంస్థ గురువారం తెలిపింది. వ్యక్తికి కొన్ని రోజులుగా అలసటగా ఉండడం తప్పించి మరే ఇతర లక్షణాలు కనిపించలేదని సీడీసీ తెలిపింది. బాధితుడిని ప్రత్యేకంగా ఉంచి.. చికిత్సనందిస్తున్నామని.. ఇన్ ఫ్లూయెంజా యాంటీ వైరల్ ఔషధంతో చికిత్స చేసినట్టు పేర్కొంది. ఇన్ ఫ్లూయెంజా యాంటీ వైరల్ ఔషధంతో చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. రోగి పూర్తిగా కోలుకున్నాడు. బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1 వైరస్) బారిన పడిన పక్షులకు సన్నిహితంగా ఉన్న 2,500 మందిని పరిశీలనలో ఉంచినట్టు సీడీసీ ప్రకటించింది. అయితే మనుషుల్లో బర్ద్ ఫ్లూ కేసు 2021 డిసెంబర్ లో బ్రిటన్ లోనూ మొదటిసారిగా వెలుగు చూసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: Nara Lokesh: అట్టుంటది ఒక్క చాన్స్ తోని.. మంత్రి కేటీఆర్ వీడియో షేర్ చేసిన నారా లోకేష్..