Tirumala: తిరుమలలో బ్యాగ్ కలకలం.. ఆందోళనలో భక్తులు
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో(Tirumala) అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. షాపింగ్ కాంప్లెంక్స్ వద్ద బ్యాగ్ ను గమనించిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. 3 గంటలుగా బ్యాగు పడి ఉండటంతో....
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో(Tirumala) అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. షాపింగ్ కాంప్లెంక్స్ వద్ద బ్యాగ్ ను గమనించిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. 3 గంటలుగా బ్యాగు పడి ఉండటంతో టీటీడీ(TTD) విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. బ్యాగ్ ను క్షుణ్నంగా పరిశీలించాయి. అయితే బ్యాగ్‌లో ఎలాంటి ప్రమాదకర వస్తువులు కనిపించలేదు. దీంతో అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. భక్తులెవరో బ్యాగ్ ను మర్చిపోయి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
గతంలోనూ తిరుమలలో భక్తుల నగదు, సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది అత్యంత చాకచక్యంగా దొంగలను పట్టుకుంది. కర్నాటకకు చెందిన మురుగన్ భక్త బృందం శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చింది. భక్తులు రద్దీగా ఉన్న ప్రాంతంలో మురుగన్ బ్యాగును దొంగలు కొట్టేశారు. ఆ బ్యాగులో 3 సెల్ ఫోన్లు, రూ.15వేల 330 నగదు ఉంది. దీంతో బాధితుడు వెంటనే టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. తిరుపతి అలిపిరి డౌన్ టోల్ గేట్ దగ్గర దొంగలను పట్టుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also Read