PM Imran Khan: మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అమెరికా మమ్మల్ని వాడుకుని వదిలేసింది..

Pakistan PM Imran Khan: ఏ చిన్న సమయం, సందర్భం వచ్చినా భారత దేశం మీద పడి ఏడవడానికి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు రెడీగా ఉంటాడు.. తాజాగా భారత్, అమెరికా స్నేహాన్ని ఓర్చుకోలేని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..

PM Imran Khan: మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అమెరికా మమ్మల్ని వాడుకుని వదిలేసింది..
Imrankhan
Follow us
Surya Kala

|

Updated on: Aug 13, 2021 | 8:02 AM

Pakistan PM Imran Khan: ఏ చిన్న సమయం, సందర్భం వచ్చినా భారత దేశం మీద పడి ఏడవడానికి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు రెడీగా ఉంటాడు.. తాజాగా భారత్, అమెరికా స్నేహాన్ని ఓర్చుకోలేని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉపఖండంలో తన భాగ్యస్వామిగా భారత్ ను అమెరికా ఎంచుకుందని.. అందుకనే పాకిస్థాన్ ను భిన్నంగా పరిగణిస్తుందని అన్నాడు. భారత్ తో పోల్చితే తమ దేశంతో అమెరికా భిన్న వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి తాలిబన్లను తరిమికొట్టేందుకు పాకిస్థాన్ ను ఓ పావులా వాడుకుందంటూ అమెరికాపై ఇమ్రాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ సంక్షోభం పేరిట పాకిస్థాన్ ను 20 ఏళ్లపాటు తన అవసరాలకు తమను అమెరికా ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు. భారత్ తో దౌత్య సంబంధాలకు అమెరికా అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందంటూ తన అక్కసు వెళ్లగక్కారు ఇమ్రాన్.

అయితే తాలిబన్ నేతలు గతంలో పాకిస్థాన్ కు వచ్చినప్పుడు శాంతి ఒప్పందానికి అంగీకరించాలని తాను చెప్పానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆఫ్ఘన్ లో ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయ అంగీకారం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం కారణంగా దాదాపు మూడు మిలియన్ల మంది ప్రజలు పాకిస్తాన్ గిరిజన ప్రాంతాల నుంచి తరలివెళ్ళిపోయారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ కంటే పాకిస్తాన్‌లో ఎక్కువ జనాభా ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రజలు ఒకరితో ఒకరు పోరాడతారు.. అయితే వారు బయటివారు వెళ్ళితే.. అందరూ కలిసిపోతారని తెలిపారు. అయితే అష్రాఫ్ ఘని అధికారంలో ఉన్నంతకాలం తాము శాంతిచర్చలకు వెళ్లబోమని తాలిబన్ నేతలు అంటున్నారని తెలిపారు. తమ నుంచి సహాయసహకారాలు అందుకుంటున్న పాకిస్థాన్, మరోవైపు తాలిబన్లకు మద్దతు ఇస్తోందన్న భావన అమెరికా ప్రభుత్వంలో నెలకొంది.

Also Read: Laal Singh Chaddha: కాకినాడలో సందడి చేస్తున్న ఆమిర్ ఖాన్.. ఫోటోల కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్