అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీసుకు 40 ఏళ్ళ జైలు శిక్ష

అమెరికాలోని  మినియా పొలీస్ రాష్ట్రంలో నల్ల  జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ ని కోర్టు దోషిగా  నిర్ధారించింది. 

అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ  పోలీసుకు 40 ఏళ్ళ జైలు శిక్ష
Us Ex Cop Derek Chauvin Convicted For Floyd's Murder
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 21, 2021 | 12:44 PM

అమెరికాలోని  మినియా పొలీస్ రాష్ట్రంలో నల్ల  జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ ని కోర్టు దోషిగా  నిర్ధారించింది.  సెకండ్ డిగ్రీ మర్డర్,మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్, మ్యాన్ స్లాటర్ అభియోగాల కింద అతడిని దోషిగా  పేర్కొంది. గత  ఏడాది మే 25 న మినియాపొలీస్ లో జార్జి ఫ్లాయిడ్ గొంతును తన మోకాలితో 9 నిముషాలపాటు  నొక్కడంతో ఫ్లాయిడ్ ఊపిరి ఆడక మరణించాడు. ఆ కేసులో ఇన్నాళ్లూ డెరెక్ కి బెయిల్ లభించినప్పటికీ.. కోర్టు అతడిని దోషిగా  నిర్ధారించింది. చేతులకు సంకెళ్లు వేసి అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు.  ఇతడికి గరిష్టంగా 40 ఏళ్ళ   జైలు శిక్ష పడే  అవకాశం ఉంది. జడ్జి పీటర్ కాహిల్ తన తీర్పును చదివి వినిపించారు.

ఫ్లాయిడ్  హత్య నాడు అమెరికాలో భారీ ఎత్తున నిరసనలకు దారి  తీసింది.నల్ల జాతీయుల  పట్ల వివక్ష చూపుతున్నారంటూ లక్షలాది మంది  కొన్ని  నెలల పాటు ఆందోళనలకు  దిగారు.   కాగా   తీర్పు సమాచారం అందిన వెంటనే అధ్యక్షుడు జొబైడెన్ స్పందిస్తూ   ఈ కేసులో ఇప్పటికైనా న్యాయం జరిగిందన్నారు. అలాగే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా తీర్పు పట్ల హర్షం వ్యక్తం  చేశారు.ఇది అమెరికాలో జరిగిన న్యాయం  అని ఆమె అభివర్ణించారు. దేశంలో తొలి బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ అయిన . ఈమె.’ఈ తరుణంలో చరిత్ర 9 నిముషాలపాటు వెనక్కి తిరిగి చూస్తుంది’ అన్నారు. జార్జి ఫ్లాయిడ్ కుటుంబ సభ్యుల తరఫు లాయర్ కూడా మినియాపొలీస్ కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం  చేశారు. అటు-కోర్టు సరైన తీర్పు ప్రకటించిందని, అయితే అసలైన న్యాయం ఇంకా జరగాల్సి ఉందని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా  అన్నారు.