అమ్మో అమెరికా ! హెచ్-1 బీ వీసాలకు మళ్ళీ బ్రేక్ !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ పని ఆధారిత (వర్క్ బేస్డ్) హెచ్ 1-బీ వీసాలపై పడ్డారు. వీటి జారీ అనుమతిని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన యోచిస్తున్నాడట...

అమ్మో అమెరికా ! హెచ్-1 బీ వీసాలకు మళ్ళీ బ్రేక్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 09, 2020 | 12:51 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ పని ఆధారిత (వర్క్ బేస్డ్) హెచ్ 1-బీ వీసాలపై పడ్డారు. వీటి జారీ అనుమతిని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన యోచిస్తున్నాడట. అలాగే స్టూడెంట్ వీసాలపై కూడా ‘కత్తెర’ పడనుందని సమాచారం. అంటే హెచ్-1 బీ వీసాలతో బాటు హెచ్-2  బీ వీసాలకు కూడా ఇది వర్తించవచ్ఛు. నిరుద్యోగ అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడం, స్థానికులకు జాబ్స్ ఇఛ్చిన సంస్థలకు రాయితీలు ఇఛ్చి ప్రోత్సహించడం ట్రంప్ ప్రభుత్వ లక్ష్యాలుగా కనిపిస్తున్నదని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ప్రస్తుతం ఈ దేశంలో హెచ్-1 బీ స్టేటస్ లో సుమారు ఐదు లక్షలమంది విదేశీ కార్మికులు పని చేస్తున్నారు. ఇదే సమయంలో కరోనా కాటు ఫలితంగా దేశంలో నిరుద్యోగం అమాంతంగా పెరిగిపోయింది. నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నవారి సంఖ్య మూడు కోట్ల మందికి పైగా పెరిగిపోయిందట. కరోనా దెబ్బతో ఒక్క నెలలోనే రెండు కోట్ల మంది జాబ్స్ కోల్పోయినట్టు అంచనా. అమెరికాలో  నిరుద్యోగ రేటు 14.7 శాతానికి పెరిగిపోయిందని, ఈ దేశ చరిత్రలో ఇది ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ పరిణామాల ఫలితంగా అధ్యక్షుని ఇమ్మిగ్రేషన్ సలహాదారులు హెచ్-1 బీ వీసాలకు  తాత్కాలికంగా బ్రేక్ వేసేందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ నెలలోనే ఈ ఆర్డర్ జారీ కావచ్ఛు.